Prashant Kishor: జన్ సూరజ్ రాజ్యాంగంలో రైట్ టూ రీకాల్.. ప్రశాంత్ కిషోర్

by vinod kumar |
Prashant Kishor: జన్ సూరజ్ రాజ్యాంగంలో రైట్ టూ రీకాల్.. ప్రశాంత్ కిషోర్
X

దిశ, నేషనల్ బ్యూరో: అక్టోబర్ 2న అధికారికంగా ప్రకటించనున్న జన్ సూరజ్ పార్టీ రాజ్యాంగంలో ‘రైట్ టూ రీకాల్’ నిబంధనను చేర్చుతామని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలిపారు. భారతదేశంలో పార్టీ రూల్స్‌లో రైట్ టూ రీకాల్ చేర్చిన మొదటి రాజకీయ పార్టీ జన్ సూరాజ్ అవుతుందని చెప్పారు. బుధవారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల పని తీరు నచ్చకపోతే రెండున్నరేళ్ల తర్వాత వారిని తొలగించే హక్కు ఓటర్లకు ఉంటుందన్నారు. జన్ సూరజ్ టిక్కెట్‌పై ఎన్నికల్లో గెలిచిన నాయకుడు ప్రజల అంచనాలను అందుకోలేకపోతే, అతనిపై ప్రజలు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం కల్పిస్తామన్నారు. తమ ప్రజాప్రతినిధులపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తగిన సంఖ్యలో ఓటర్లు మద్దతిస్తే, తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందని చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితికి నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ లేనని విమర్శించారు.

Advertisement

Next Story