Public governance : ఇది కదా ప్రజాపాలన..నిరుద్యోగికి ఆటో

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-23 05:23:39.0  )
Public governance : ఇది కదా ప్రజాపాలన..నిరుద్యోగికి ఆటో
X

దిశ, వెబ్ డెస్క్ : ఇది కదా ప్రజాపాలన(Public governance)అంటూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పీఆర్వో అయోధ్యరెడ్డి(Ayodhya Reddy) ప్రజావాణితో నిరుద్యోగికి లభించిన స్వయం ఉపాధి కథనంతో ఎక్స్ లో పోస్టు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రజావాణి కార్యక్రమంలో మూడు వారాల క్రితం ఎర్రగడ్డకు చెందిన మేదరి అశోక్ అనే నిరుద్యోగి స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రజావాణి అధికారులు అతడి దరఖాస్తును ఎస్సీ కార్పేరేషన్ కు పంపగా, అతడికి సబ్సిడీ కింద ఎలక్ట్రికల్ ఆటో మంజూరైంది. ప్రణాళిక సంఘం చైర్మన్, ప్రజావాణి ఇంచార్జీ జి.చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య దేవరాజ్ లు ప్రజావాణి కార్యక్రమంలో ఆటోను ఆశోక్ కు అందించారు.

ఈ కథనాన్ని పోస్టు చేసిన అయోధ్యరెడ్డి ఇది కదా ప్రజాపాలన అని, స్వయం ఉపాధి కోసం చేసుకున్న దరఖాస్తుకి ప్రజావాణి సత్వరం పరిష్కారం అందించిందని తెలిపారు. ఉపాధి కోల్పోయిన వారు ఎవరైనా, మాయ మాటలు విని బతుకులు ఛిద్రం చేసుకోకుండా ప్రజా ప్రభుత్వం ద్వారా వారి బతుకులు చక్కదిదుకున్న ఘటనలు ఎన్నో.... ఇది ప్రజా ప్రభుత్వం విజయ పరంపర అని పేర్కొన్నారు.

ఇది కదా...రైతు సర్కార్

మరో ట్వీట్ లో ధాన్యం రైతులకు రూ.500బోనస్ అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం రైతు ప్రభుత్వమని అయోధ్యరెడ్డి స్పష్టం చేశారు. వడ్లకు బోనస్ ఇస్తారా ? ఎలా సాధ్యం ? అసలే గత పదేళ్ల చీకటి రాజ్యంలో చేసిన 7 లక్షల కోట్ల అప్పులు ఉండగా బోనస్ ఇవ్వడం సాధ్యం కాదేమో... ఇలాంటి ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ... పంట పండించిన రైతు బ్యాంకు ఖాతాలో బోనస్ పైసలను ప్రజా ప్రభుత్వం జమ చేస్తుందని రాసుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేవలం 15 రోజుల్లో 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రుణ మాఫీ చేశారని, ఇప్పుడు బోనస్ అందిస్తున్నారని ఇదీ రైతు సర్కార్ అంటే అని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed