- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Movies: కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. కానీ, అందరూ పుష్ప 2 కోసమే వెయిట్ చేస్తున్నారా?
దిశ, వెబ్ డెస్క్ : ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే, నవంబర్ నెల అనేది అన్ని సినిమాలకి మంచి సీజన్. ఈ సారి పెద్ద సినిమాలు ఏవి కూడా రాలేదు. రిలీజ్ అయిన చిన్న, మధ్య తరగతి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచిగా ఆడలేదు. ఇది ఇంకోసారి ప్రూవ్ అయ్యింది. శుక్రవారం రోజున విశ్వక్ సేన్ (Vishwak Sen) ‘మెకానిక్ రాకీ’, సత్యదేవ్ ‘జీబ్రా’, గల్లా అశోక్ (Ashok Galla) ‘దేవకీ నందన వాసుదేవ’ వంటి సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. వీటితో పాటు ‘మందిర’ ‘కేసీఆర్'(కేశవ చంద్ర రామావత్) చిత్రాలు వచ్చాయి. కానీ, వీటిలో ఏవి కూడా మంచి రెస్పాన్స్ అందుకోలేకపోయాయి.
మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) యావరేజ్ అని అంటున్నారు. కానీ, ఓపెనింగ్స్ మాత్రం లేవు. దీని బట్టే అర్ధం చేసుకోవచ్చు. సినీ లవర్స్ ‘పుష్ప 2’ మూవీ కోసమే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే వారం నవంబర్ 29న, 30న విడుదలయ్యే సినిమాల పరిస్థితి ఇలాగే ఉంటుందని సినీ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.
Read More..