India-Maldives: భారత్‌,మాల్దీవుల మధ్య అపార్థాలు తొలిగిపోయాయి..మాల్దీవుల విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

by Maddikunta Saikiran |
India-Maldives: భారత్‌,మాల్దీవుల మధ్య అపార్థాలు తొలిగిపోయాయి..మాల్దీవుల విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్:భారత్‌(India)-మాల్దీవుల(Maldives) మధ్య ఉన్న అపార్థాలు పూర్తిగా తొలిగిపోయాయని మాల్దీవుల విదేశాంగ మంత్రి(Foreign Minister) మూసా జమీర్(Moosa Zameer) తెలిపారు. శ్రీలంక(Sri Lanka) పర్యటన సందర్భంగా శుక్రవారం జమీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మా ప్రభుత్వం ప్రారంభంలో భారత్ తో కొన్ని కఠినమైన విబేధాలున్నప్పటికీ చైనా(China), భారత్‌(India) రెండు దేశాలతోనూ మేం మంచి సంబంధాలను కలిగి ఉన్నామని,మాల్దీవులకు మద్దతివ్వడంలో ఈ దేశాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అలాగే చైనా ,భారత్‌లతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడాన్ని ఆయన ఈ సమావేశంలో హైలైట్ చేశారు.

కాగా మాల్దీవుల అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జు(Mohamed Muizzu) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మాల్దీవులతో భారత్‌కు సంబంధాలు దెబ్బతిన్నాయి.ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే తమ దేశం నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పటినుండి ఇరు దేశాల మధ్య వివాదం మొదలయ్యింది.అయితే కాలం గడిచే కొద్ది ఆ దేశం సాయం కోసం భారత్ వైపు చూస్తోంది. ముయిజ్జు వైఖరిలో కూడా క్రమంగా మార్పు వస్తోంది. కొన్ని నెలల క్రితం విదేశాంగ మంత్రి జై శంకర్‌(Jaishankar) తో మహ్మద్ ముయిజ్జు భేటీ కూడా అయ్యారు. ఆ తర్వాత భారత్ తమకు ఎప్పటికీ మిత్రదేశమని ముయిజ్జు ప్రకటించడం గమనార్హం.అలాగే మోడీ(Modi) ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కూడా ముయిజ్జు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed