ఆనాడే దోషులను శిక్షిస్తే.. ఈ దుస్థితి వచ్చేది కాదు: ఎంపీ నగేశ్

by srinivas |
ఆనాడే దోషులను శిక్షిస్తే.. ఈ దుస్థితి వచ్చేది కాదు: ఎంపీ నగేశ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో జరిగిన ఘటనల్లో దోషులను కఠినంగా శిక్షించి ఉంటే.. ఇప్పుడు జన్నూర్‌లో ఇంత ఘోరం జరిగేది కాదని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ నగేశ్ వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసిఫాబాద్ జన్నూర్‌లో ఆదివాసీ మహిళపై అత్యాచారం, హత్యకు యత్నించారని పేర్కొన్నారు. మగ్దూం అనే వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు వెల్లడించిందన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటి ఘటనేమి జరగలేదని కప్పిపుచుకునే ప్రయత్నం చేస్తోందని ఫైరయ్యారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఎంపీ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. ఆదివాసీలపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయన్నారు. ఆగస్టు 31న సంఘటన జరిగితే రెండ్రోజుల తర్వాత ఘటన వెలుగులోకి వచ్చిందని, అయినా ఇప్పటి వరకు పోలీసులు కేసు నోదు చేయలేదని ధ్వజమెత్తారు. అత్యాచారం జరగలేదని మంత్రి సీతక్క వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. ఆదివాసులకు మంత్రి క్షమాపణ చెప్పాలని ఎంపీ నగేశ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed