ముంపు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులను అందించాలి

by Sridhar Babu |
ముంపు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులను అందించాలి
X

దిశ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని మున్నేరు ముంపు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులను బాధితులకు అందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం మంచికంటి నగర్, బొక్కలగడ్డ ప్రాంతంలో మంత్రి ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులు వచ్చాయో లేదో అని తనిఖీలు చేశారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ... ఖమ్మం నగరంలోని 10 డివిజన్లలో మున్నేరు ముంపు బాధితులకు నిత్యావసర సరుకులను అందించాలని అధికారులను ఆదేశించారు.

ముంవు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా అందించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. శానిటేషన్ పనులు ప్రతి రోజూ చేయాలని సూచించారు. దాంతో పాటు వ్యాధులు రాకుండా సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే చేయాలన్నారు. డాక్టర్ల, సిబ్బంది మున్నేరు బాధితులకు అందుబాటులో ఉండాలన్నారు. ఆయా డివిజన్లలో చెత్తాచెదారం కూడా శుభ్రం చేయాలి కార్పొరేషన్ అధికారులకు సూచించారు. అనంతరం పలు విధుల్లో పర్యటించారు.

Advertisement

Next Story