ఎమ్మెల్యే వెంకట్రావు పై కేసు కొట్టివేత

by Sridhar Babu |
ఎమ్మెల్యే వెంకట్రావు పై  కేసు కొట్టివేత
X

దిశ, భద్రాచలం : ఎమ్మెల్యే వెంకట్రావు పై కేసు కొట్టివేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక వ్యక్తి ఓటర్లకు డబ్బులు పంచుతున్నాడనే నమ్మదగిన సమాచారంతో అప్పటి సీఐ సత్యనారాయణ రెడ్డి స్థానిక అంబేద్కర్ సెంటర్ లో బండారు సుధాకర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి రూ. 16,500 నగదు తో పాటు ఓటర్ స్లిప్పులను స్వాధీనం చేసుకుని విచారించారు.

డాక్టర్ తెల్లం వెంకట్రావు ఓటర్లకు పంచమని తనకు డబ్బులు ఇచ్చినట్లుగా సుధాకర్ విచారణలో పేర్కొనడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. భద్రాచలం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. గురువారం ఇరువురి వాదనలు విన్న మెజిస్ట్రేట్ వెంకటేశ్వర్లు వారిపై మోపిన అభియోగాలు నిరూపణ కాకపోవడంతో డాక్టర్ తెల్ల వెంకటరావును నిర్దోషిగా పేర్కొంటూ తీర్పునిచ్చారు. ముద్దాయిల తరఫున న్యాయవాది కొడాలి శ్రీనివాసన్ వాదించారు.

Advertisement

Next Story

Most Viewed