Maoist Azad : విప్లవ ద్రోహుల సమచారంతోనే రఘునాథపాలెం ఎన్ కౌంటర్

by Aamani |
Maoist Azad :  విప్లవ ద్రోహుల సమచారంతోనే రఘునాథపాలెం ఎన్ కౌంటర్
X

దిశ,వరంగల్ బ్యూరో : విప్లవ ద్రోహులిచ్చిన సమాచారంతో రఘునాధపాలెంలో జరిపిన ఎన్ కౌంటర్ కు రాష్ట్ర పభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టు అగ్రనేత ఆజాద్ ఆరోపించారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం- అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ(బీకే-ఏఎస్ఆర్) పేరుతో ప్రకటనల విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు కామ్రేడ్ బుచ్చన్న తో పాటు ఆరుగురు మావోయిస్టులను విప్లవ ద్రోహులిచ్చిన సమాచారం మేరకు ‘ఆపరేషన్ కగార్’ లో బాగంగానే నరహంతక గ్రేహౌండ్స్ దళాలు హతమార్చాయని ఆరోపించారు. కొంత కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేతకు ఒకటే ఎజెండాతో పని చేస్తూ కేంద్ర హోం మంత్రి ఆధ్వర్యంలో ఏర్పడిన నరహంతకులు పోలీసు ముఠాలు మావోయిస్టులపై వివిధ రూపాల్లో దాడులకు తెగబడుతూ మావోయిస్టులను హతమార్చుతున్నారని అన్నారు.

మావోయిస్టులకు త్యాగాలు కొత్తేమి కాదు..

గ్రేహౌండ్స్ దళాల చేతిలో హతమవుతున్న మావోయిస్టులకు త్యాగాలు కొత్తేమి కాదని ఆజాద్ ఉటంకించారు. దోపిడీ పీడన లేని రాజ్యం కోసం బూర్జువా రాజ్యాలతో పోరాడి ఇప్పటికే వేలాది మందిని త్యాగం చేశామని గుర్తు చేశారు. బూటకపు ఎన్ కౌంటర్ లతో మావోయిస్టులను హతం చేయాలని చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలకు మావోయిస్టులు బయపడరని రఘునాథపాలెం ఎన్ కౌంటర్ కు పూర్తి బాద్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని నెత్తుటి బాకీ త్వరలోనే తీర్చుకుంటామని ఆజాద్ హెచ్చరించారు.

అమరులకు విప్లవ జోహార్లు..

రఘునాథపాలెం బూటకపు ఎన్ కౌంటర్ లో అమరులైన కామ్రేడ్ లచ్చన్న(డివిజన్ కమిటీ సభ్యుడు రాయి గూడెం, ఛత్తీస్ఘడ్), కామ్రెడ్ తులసి (పూనెం లక్కీ) లచ్చన్న భార్య, కామ్రెడ్ రాము(పాల్వంచ-మణుగూరు ఏరియా కమాండర్ జగ్గారం ఎటపాక(ఏ.పి), కామ్రెడ్ కోసి పార్టీ సభ్యురాలు పార్టీ సభ్యురాలు( ఛత్తీస్ ఘడ్ కోమటిపల్లి), కామ్రెడ్ దుర్గేష్ పార్టీ సీనియర్ సభ్యురాలు చత్తీస్ ఘడ్ బొట్టెం గ్రామం, వీరితో పాటు గ్రామస్థుడిని కూడా పోలీసులు హతమార్చగా వారందరికీ విప్లవ జోహార్లు అర్పిస్తున్నట్లు ఆజాద్ ప్రకటించారు.

ఈ నెల 9న జిల్లా బంద్..

రఘునాథపాలెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 9న జిల్లా బంద్ కు పిలుపునిచ్చినట్లు ఆజాద్ తెలిపారు. బంద్ లో ప్రజలు, వ్యాపార సంస్థలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజలు పాల్గొని బూటకపు ఎన్ కౌంటర్ ను నిరసించాలని ఆజాద్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed