Andhra Pradesh Floods: వరద బాధితులకు మీవంతు సాయం చేయాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి

by karthikeya |
Andhra Pradesh Floods: వరద బాధితులకు మీవంతు సాయం చేయాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి
X

దిశ, వెబ్‌డెస్క్: వరద భీభత్సం వల్ల తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితులకు సాయం చేయాలనుకునేవారు విరాళాలు పంపించేందుకు ఏపీ ప్రభుత్వం బ్యాంకు ఖాతాల వివరాలు విడుదల చేసింది. ఇప్పటికే వరద బాధితులను ఆదుకునేందుకు అనేకమంది తమ వంతుగా విరాళాలు అందించి గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఒకవేళ మీరు కూడా బాధితుల సహాయం కోసం విరాళాలు ఇవ్వాలని భావిస్తే ఈ క్రింది 4 విధానాల్లో మీ వంతు సహాయం చేయొచ్చు.

తొలి విధానం:

సీఎంఆర్ఎఫ్, సీఎం రిలీఫ్ ఫండ్‌ల ఖాతాలకు నేరుగా విరాళాలు జమ చేయవచ్చు. దాని కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా..

అకౌంట్ హోల్డర్: సీఎంఆర్‌ఎఫ్‌

అకౌంట్ నంబర్‌: 38588079208

బ్రాంచ్‌: ఏపీ సచివాలయం, వెలగపూడి

ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ఎస్‌బీఐఎన్‌0018884

(లేదా)

అకౌంట్ హోల్డర్: సీఎం రిలీఫ్‌ ఫండ్‌

అకౌంట్ నంబర్‌: 110310100029039

బ్రాంచ్‌: ఏపీ సచివాలయం, వెలగపూడి

ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: యూబీఐఎన్‌0830798

లకు నగదు పంపవచ్చు.

రెండో విధానం:

ఒకవేళ ఎవరైనా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద విరాళాలు చెల్లించాలని అనుకుంటే..

అకౌంట్ హోల్డర్: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌‌

అకౌంట్ నంబర్‌: 00000036897128069

బ్రాంచ్‌: ఎంజీ రోడ్డు, విజయవాడ

ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ఎస్‌బీఐఎన్‌0016857

వివరాలతో నగదు డిపాజిట్ చేయవచ్చు.

మూడో విధానం:

చెక్‌ రూపంలో ఇవ్వాలనుకునే వారు ‘‘చీఫ్‌ మినిస్టర్స్‌ రిలీఫ్‌ ఫండ్‌ ఆంధ్రప్రదేశ్‌’’ పేరిట చెల్లించాలి

నాలుగో విధానం:

ఒకవేళ ఎవరైనా యూపీఐ ద్వారా విరాళం ఇవ్వాలనుకుంటే

యూపీఐ ఐడీ: 68893701@ubin, apcmrelief@andb లకు విరాళం ఇవ్వాలనుకుంటున్న నగదును పంపవచ్చు.

Advertisement

Next Story

Most Viewed