- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీడిన జంట హత్యల కేసు మిస్టరీ
48 గంటల్లోనే కేసును చేధించిన జిల్లా పోలీసులు
నలుగురి పై కేసు నమోదు
దిశ, గుడిహత్నూర్: మండలంలోని గర్కంపేట్ సమీపంలో రెండు రోజుల క్రితం కలకలం రేపిన జంట హత్యల కేసును జిల్లా పోలీసులు 48 గంటల్లోనే చేధించారు.ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా కేంద్రంలోని హెడ్ క్వార్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జంట హత్యల వివరాలను వెల్లడించారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కేఆర్కే కాలనీకి చెందిన అశ్వినికి సుందరయ్య నగర్ కాలనీకి చెందిన సోన్ కాంబ్లే రమేష్ తో పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది.
గత మూడు నెలల నుంచి సోన్ కాంబ్లే అశ్విని, మహమ్మద్ రహమాన్, ఇతరులతో సన్నిహితంగా ఉంటుందని అనుమానంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉండేవి. దీంతో అశ్విని గత మూడు నెలల నుంచి తన తండ్రి రావుసాబ్ వద్దే ఉంటుంది. అశ్విని ఇతరులతో తిరుగుతున్న విషయాన్ని రమేష్ తన చెల్లెలు స్వప్న, షీలా మరియు బావ వెంకటేష్ కు చెప్పగా అశ్విని వారి పరువు తీస్తుందని తనను ఎలాగైనా అంతమమొందిచాలని నిర్ణయించుకున్నారు.
ఏప్రిల్ 28న ఉదయం రమేష్ తన కొడుకు లోకేష్ తో కలిసి కే ఆర్ కే కాలనీకి వెళ్లి ఉదయం తాను కిరాయికి తీసుకున్న ఇల్లు శుభ్రం చేయడానికి అశ్విని వస్తుందని తన మామ రావుసాబ్ కు ఫోన్ చేసి చెప్పాడు. అశ్విని బయలుదేరి చాలాసేపు అయిందని మామ సమాధానం ఇవ్వగా రమేష్ కు అనుమానం వచ్చి మీ అమ్మ గతవారం ఎక్కడికి వెళ్ళిందో నీకు గుర్తుందా అని కొడుకు లోకేష్ ను అడిగాడు. అవును నాకు గుర్తుంది అమ్మ ఎక్కడికి వెళ్లిందో చూపిస్తానని ఆదిలాబాద్ నుంచి ఆటోలో కొడుకు లోకేష్ చెప్పిన ప్రకారంగా గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది పరిధిలోని గర్కంపేట్ కు వచ్చారు.
రోడ్డు కుడి వైపు వేప చెట్టు కింద స్కూటీ కనబడగానే రమేష్ కొడుకు డాడీ మేము ఇంతకు ముందు వచ్చిన స్కూటీ ఇదే అని రమేష్ కు చూపించాడు. స్కూటీ ఉన్న ప్రదేశం నుంచి కుడివైపు కొంత దూరం వెళ్లి పొదల్లో చూడగా రమేష్ భార్య అశ్విని, రహమాన్ సన్నిహితంగా ఉండడం చూశాడు. దీంతో రమేష్ పక్కకు వచ్చి తన ఇద్దరు చెల్లెలు, బావకి ఫోన్ చేసి అక్కడికి పిలిచాడు. దీంతో వారు ఆదిలాబాద్ నుంచి రమేష్ ఉన్న ప్రదేశంలో ఆటోలో చేరుకున్నారు. అందరూ కలిసి అశ్విని మరియు రెహమాన్ ను ఎలాగైనా చంపాలని ఫిక్స్ అయ్యారు.
అక్కడే ఉన్న కర్రను రమేష్ తీసుకొని వారు సాన్నిహితంగా ఉన్న సమయంలో వెనుక నుండి రెహమాన్ తలపై బలంగా కొట్టాడు. ఈ క్రమంలో అశ్విని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా రమేష్ చెల్లెలు మరియు బావ పట్టుకోగా రమేష్ అశ్విని నుదటిపై, తల వెనుక భాగంలో బలంగా కర్రతో కొట్టి చంపేశాడు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్లను రప్పించారు.
డీఎస్పీ ఉట్నూర్, సీఐ ఇచ్చోడ, గుడిహత్నూర్, నెరడిగొండ ఇంద్రవెల్లి, సిరికొండ, ఎస్సైలతో ఆరు టీంలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేరం జరిగిన 48 గంటలను కేసును చేధించి నేరస్తులను పట్టుకున్నామని తెలిపారు.కేసును ఛేదించడంలో ముఖ్య పాత్ర పోషించిన పోలీసులందరిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో ఉట్నూర్ డీఎస్పీ సీహెచ్ నాగేందర్, ఇచ్చోడా సీఐ ముదావత్ నైలు, సీసీఎస్ ఇన్ స్పెక్టర్ చంద్రమౌళి, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ, నేరడిగొండ, ఎస్సై లు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.