ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసిన వ్యక్తికి వింత శిక్ష (వీడియో)

by Hamsa |   ( Updated:2022-11-25 05:36:17.0  )
ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసిన వ్యక్తికి వింత శిక్ష (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో అమ్మాయిల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇంట్లో, బయట ఎక్కడా కూడా రక్షణ లేకుండా పోయింది. చిన్నా-పెద్దా.. ముసలి-ముతక అనే తేడా లేకుండా కొంత మంది దుర్మార్గులు అత్యాచారాలు చేస్తున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే బీహార్‌లో చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసిన యువకుడికి వింతగా 5 గుంజీళ్ల శిక్ష విధించారు.

వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని నవాడా జిల్లా అక్బర్‌పూర్ ప్రాంతంలో 5 ఏళ్ల చిన్నారి తన కుటుంబంతో కలిసి ఉంటుంది. అయితే అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కోళ్ల ఫారంలో పని చేస్తున్నాడు. ఆ చిన్నారిపై కన్నేసి అదును దొరకడంతో ఒకరోజు కోళ్ల ఫారం‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అక్కడ ఆ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించి రేప్ చేశాడు. అనంతరం బాలిక ఇంటికి చేరుకుని విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో కుటంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకునే లోపు నిందితుడు అతడి యజమానిని సంప్రదించి వాళ్లను పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా అపేశాడు. ఆ తర్వాత కోళ్ల ఫారం యజమాని తన పలుకుబడిని ఉపయోగించి ఊర్లోనే పంచాయతీ ఏర్పాటు చేశారు. అందులో రేప్ చేసిన యువకుడికి పంచాయితీ పెద్దలు శిక్షగా 5 గుంజీళ్లు తీయించారు. అతడిని పోలీసులకు అప్పగించకుండా వదిలేశారు. కోళ్ల ఫారం యజమాని ఒత్తిడి చేయడమే కాకుండా కొంత డబ్బును కూడా ఆ కుటుంబానికి ఇచ్చి సైలెంట్‌గా ఉండేలా చేసినట్టు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed