సీఎంకు సీపీఐ రామకృష్ణ లేఖ

by srinivas |   ( Updated:2020-07-19 22:46:51.0  )
సీఎంకు సీపీఐ రామకృష్ణ లేఖ
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఈ లేఖలో ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయి నిరుపయోగంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. తాము జగ్గయ్యపేటలో టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను నిన్న పరిశీలించడం జరిగిందని లేఖలో వెల్లడించారు. ఆయా ఇళ్లను ప్రజల డబ్బుతోనే నిర్మించారేగాని ఏ ఒక్క పార్టీ సొంత నిధులతో నిర్మించారని గ్రహించాలని ఆయన సూచించారు. తెలుగుదేశంపై ఉన్న రాజకీయ, వ్యక్తిగత వ్యతిరేకతను ప్రజలపై తీర్చుకోవటం సరికాదని ఆయన హితవు పలికారు. వాలంటీర్లు బెదిరించి ‘ఆ ఇల్లు మాకొద్దని’ లబ్ధిదారులుచే సంతకాలు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన వెల్లడించారు. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని రామకృష్ణ లేఖలో హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed