అమరులైన రైతులకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి: సీపీఐ నారాయణ

by srinivas |   ( Updated:2021-11-19 04:51:37.0  )
అమరులైన రైతులకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి: సీపీఐ నారాయణ
X

దిశ, ఏపీ బ్యూరో: గత సంవత్సర కాలంగా దేశ రాజధాని సరిహద్ధులో రైతు సంఘాలు చేస్తున్న పోరాటానికి దిగొచ్చి మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం శుభపరిణామమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. నూతన సాగు చట్టాల రద్దుకు లక్షలాది మంది రైతులు విరోచితంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించారని కొనియాడారు.

చాలామంది రైతులు పోరాటంలో అమరులైనా అలుపెరగకుండా దీక్షలు చేసి విజయం సాధించారని ప్రశంసించారు. యావత్తు దేశం రైతులు చేస్తున్న ఉద్యమానికి బాసటగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ఎంతటి కఠిన హృదయమైనా కరగక మానదన్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం సంతోషమని.. ఈ విషయంలో వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ పోరాటంలో అమరులైన రైతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని నారాయణ డిమాండ్‌ చేశారు.

Advertisement

Next Story