పెట్టుబడిదార్లకు వ్యతిరేకంగా పోరాడాలి: సీపీఐ

by Shyam |
పెట్టుబడిదార్లకు వ్యతిరేకంగా పోరాడాలి: సీపీఐ
X

దిశ, నల్లగొండ: ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను స్ఫూర్తిగా తీసుకొని కార్మికులు, రైతులు, శ్రమజీవులంతా పెట్టుబడిదార్లకు వ్యతిరేకంగా పోరాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా మునుగోడులో కార్మికులు, కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు ఆయా సెంటర్లలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కేంద్రం వలస కార్మికులకు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వకుండా బ్యాంకు ఎగవేతదార్లకు వేల కోట్ల రూపాయలు మాఫీ చేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: CPI, unveiling flags, May Day, nalgonda, Workers, munugode

Advertisement

Next Story