పెన్షన్ల మంజూరులో బీజేపీ విఫలం…

by Shyam |
పెన్షన్ల మంజూరులో బీజేపీ విఫలం…
X

దిశ, హుస్నాబాద్: ఫ్రీడమ్ ఫైటర్లకు పెన్షన్లు మంజూరు చేయడంలో బీజేపీ సర్కార్ విఫలమయ్యిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. వీరబైరాన్ పల్లి, హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గుట్టపై మృతి చెందిన అమరులకు సోమవారం ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తితో పాటు ప్రజాస్వామ్య హక్కుల కోసం జరిగిందన్నారు. గ్రామాల్లో దాడులు చేస్తూ రజాకర్లు అందిన కాడికి దొచుకుపోయారని అన్నారు. అంతే కాకుండా మహిళలను చిత్రహింసలకు గురి చేశారని ఆయన అన్నారు. అడ్డు వచ్చిన వారిని హతమార్చడంతో గ్రామాలన్ని సంఘటితమై సాయధ పోరాటాన్ని నడిపాయన్నారు. రాజకీయ లబ్ధికోసం రైతాంగ సాయుధ పోరాటం హిందూ, ముస్లీంలకు జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చెప్పడం చరిత్రను వక్రీకరించడమే అని మండిపడ్డారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్నిఅధికారికంగా జరపాలని ప్రభుత్వాలతో కొట్లాడుతానని గతంలో కేసీఆర్ గొప్పలు చెప్పారని అన్నారు. నేడు తానే సీఎంగా ఉండి తెలంగాణ విమోచన దినోత్సవాన్నికేసీఆర్ ఎందుకు నిర్వహించలేకపోతున్నారని ప్రశ్నించారు.

Read Also…

ఎల్ఆర్ఎస్‎పై కాంగ్రెస్ ఎంపీ పిటిషన్ దాఖలు..!

Advertisement

Next Story