- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేటీఎం యాప్‌లో కొవిడ్ టీకా స్లాట్ బుకింగ్
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎం నుంచి కేవలం డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవమే కాదు.. వ్యాక్సిన్‌ను బుక్ చేసుకోవచ్చు. కొవిడ్ టీకా స్లాట్ బుక్ చేసుకునేందుకు భారత ప్రభుత్వం కొత్తగా పేటీఎంకు ఈ అవకాశాన్ని కల్పించింది. ఇప్పటివరకు టీకా స్లాట్ బుకింగ్ కేవలం కోవిన్, ఆరోగ్య సేతు యాప్, వెబ్‌సైట్లలో మాత్రమే బుక్ చేసుకునే వెసలుబాటు ఉండేది. ప్రస్తుతం థర్డ్ పార్టీ సంస్థలకు కూడా ఈ సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పేటీఎంకు అవకాశం లభించింది.
ఇప్పటి నుంచి పేటీఎంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను బుక్ చేసుకోవచ్చు. పేటీఎం యాప్‌లోకి వెళ్లి అందులో ఉండే కొవిడ్ వ్యాక్సిన్ ఫైండర్ ఆప్షన్‌లో వ్యాక్సిన్ స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. సమీపంలోని వ్యాక్సిన్ సెంటర్‌ను వెదకవచ్చు. ఆయా సెంటర్లలో ఎన్ని స్లాట్లు అందుబాటులో ఉన్నాయి, ఏయే సెంటర్లలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ ఇస్తున్నారో తెలుసుకోవచ్చు. ఇక వ్యాక్సిన్ సెంటర్లను పిన్‌కోడ్‌తో కూడా వెదకవచ్చు. జిల్లాల వారీగా కూడా వ్యాక్సిన్ సెంటర్ల సమాచారం తెలుసుకునే సదుపాయం కూడా కల్పించారు.