- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాన్ వెజ్ ప్రియులా.. టేస్టీ టేస్టీ చికెన్ పికిల్‌ను ఇలా తయారు చేసుకోండి!
దిశ, ఫీచర్స్: నిల్వ పచ్చళ్లు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా మగాయ, ఆవకాయ, గోంగూర వంటి రకరకాల నిల్వ పచ్చళ్లు అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. అలాగే నాన్ వెజ్ ప్రియులకు కూడా చికెన్ పచ్చడి అంటే ఇష్టంగా లాగించేస్తారు. దీనిని తయారు చేయడం కష్టమని కొందరు అనుకుంటారు. కానీ, దీనిని ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో ఈజీగా తయారు చేయవచ్చు. ఇప్పుడు దీనిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావల్సిన పదార్థాలు:
చికెన్ - 1 కేజి(బోన్‌లెస్)
కారం - 3 టేబుల్ స్పూన్లు
నూనె - 400 మి.లీ
గరం మసాలా - 2 టీస్పూన్లు
పసుపు - 1 స్పూన్
ఉప్పు - తగినంత
లవంగాలు - 3
యాలకులు - 3
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
దాల్చిన చెక్క - 2 అంగుళం
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 100 గ్రాములు
నిమ్మకాయ - 1
తయారీ విధానం:
ముందుగా చికెన్‌ను మీకు నచ్చిన సైజ్‌లో కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను శుభ్రంగా కడగాలి. తరువాత ఒక గిన్నెలో చికెన్ ముక్కలను వేసి, దానిపై పసుపు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిపి 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి, పాన్ పెట్టుకోవాలి. దానిలో కొద్దిగా నీరు పోసి చికెన్‌ను ఉడికించుకోవాలి. తరువాత లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులను వేయించి, మిక్సి పట్టుకుని, పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె పోసి, గోల్డ్ కలర్ వచ్చేవరకు చికెన్‌ను ఫ్రై చేయాలి. ఆ తర్వాత వాటని నూనె నుంచి తీసి పక్కన పెట్టాలి. అదే నూనెలో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అందులో వేయించి పెట్టిన చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఉడికిన తరువాత కారం, మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే చికెన్ పచ్చడి రెడీ.