CEO Fires Employees: మ్యూజిక్‌ కంపెనీ సీఈఓ షాకింగ్ నిర్ణయం.. మీటింగ్‌కు అటెండ్ అవ్వలేదని ఉద్యోగులపై వేటు..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-18 13:33:03.0  )
CEO Fires Employees: మ్యూజిక్‌ కంపెనీ సీఈఓ షాకింగ్ నిర్ణయం.. మీటింగ్‌కు అటెండ్ అవ్వలేదని ఉద్యోగులపై వేటు..!
X

దిశ,వెబ్‌డెస్క్: అమెరికా(America)కు చెందిన ఓ మ్యూజిక్‌ కంపెనీ సీఈవో(Music Company CEO) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్వహించిన మీటింగ్‌(Meeting)కు హాజరు కాలేదన్న కారణంతో 90 శాతం సిబ్బంది(Staff)ని తొలగించారు. మొత్తం 110 మంది ఉద్యోగుల్లో 99 మందిపై వేటు వేశారు. ఆ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సోషల్ మీడియా(Social Media) వేదికగా పెట్టిన పోస్ట్‌తో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరి(Employees)కీ సీఈవో ఇటీవలే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉద్యోగులందరూ అటెండ్(Attend) కావాలని ఆయన ఆదేశించారు. అయితే 110 మంది ఉద్యోగుల్లో 99 మంది ఈ మీటింగ్‌కు హాజరు కాలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సీఈవో సమావేశానికి హాజరుకాని 99 మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. సిబ్బందిపై వేటు వేయడమే కాకుండా కంపెనీకి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని వెంటనే తిరిగి ఇచ్చేయాలని, మీటింగ్‌కు అటెండ్ అయిన ఉద్యోగులు మాత్రమే సంస్థలో ఉంటారని స్పష్టం చేశారు.

మన ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనులు పూర్తిచేయడంలో, సమావేశాలకు హాజరుకావడంలో మీరు విఫలమయ్యారు. అందుకే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నానని ఆయన ప్రకటించారు. కాగా సీఈవో తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్(Viral)గా మారింది. దీనిపై నెటిజన్లు(Netizens) తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. కేవలం మీటింగ్ కు హాజరు కాలేదన్నా కారణంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం అన్యాయం అంటూ ఫైర్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed