ఏపీ ప్రథమ స్థానం.. ఇది మన రాష్ట్ర దుస్థితి: చంద్రబాబు, జగన్‌పై వైఎస్ షర్మిల ఫైర్

by srinivas |
ఏపీ ప్రథమ స్థానం.. ఇది మన రాష్ట్ర దుస్థితి:  చంద్రబాబు, జగన్‌పై వైఎస్ షర్మిల ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Congress state president YS Sharmila) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారాలు, అఘాయిత్యాలు అరికట్టడంలో 10 ఏళ్లుగా టీడీపీ(Tdp), వైసీపీ(Ycp) ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. ఇవాళ శాసనమండలిలో జరిగిన చర్చనే ఇందుకు నిదర్శనమని షర్మిల విమర్శించారు.

గత అత్యాచారాలు, అఘాయిత్యాలపై గత పదేళ్లలో నమోదైన కేసులపైనా టీడీపీ, వైసీపీ రాజకీయాలు చేస్తున్నాయని వైఎస్ షర్మిల ఆరోపించారు. గడిచిన 10 ఏళ్లలో సుమారు 2 లక్షల కేసులు నమోదు అయ్యాయంటే మహిళల భద్రతలో మన రాష్ట్రం ఎక్కడుందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. మహిళలపై క్రైమ్ రేట్ అరికట్టలేకపోవడం నిజంగా సిగ్గుపడాలని, సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమన్నారు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు పేరుకే తప్పా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. నిర్భయ చట్టం ప్రకారం మహిళలపై వికృత చేష్టలకు పాల్పడితే 40 రోజుల్లో కఠిన శిక్షలు అని సీఎం చంద్రబాబు(సీఎం చంద్రబాబు), దిశ చట్టం కింద 20 రోజుల్లోనే ఉరి శిక్ష పడేలా చర్యలని మాజీ సీఎం జగన్(Former CM Jagan) మహిళల చెవుల్లో క్యాలి ఫ్లవర్లు పెట్టారని, కానీ చట్టాలను అమలు చేసిన దాఖలాలు లేవని మండిపడ్డారు. భద్రతకు పెద్ద పీట అని ఆర్భాటపు ప్రచారాలు చేస్తున్నారని, 10 ఏళ్లలో ఒక్క నేరస్థుడికి కూడా కఠిన శిక్ష పడలేదన్నారు. ‘‘కేసులు చేదించాల్సిన పోలీసులను కక్ష్య సాధింపు రాజకీయాలకు వాడుతున్నారు. ఏనాడూ సక్రమంగా విధులు నిర్వర్తింపజేసింది లేదు. అభివృద్ధిలో చివరి స్థానం.. మాదక ద్రవ్యాల వాడకంలో, మహిళలపై అఘాయిత్యాలలో, ప్రథమ స్థానం. ఇది మన రాష్ట్ర దుస్థితి.’’ అని వైఎస్ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed