- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Laxman: రేవంత్.. ఏడాదిలో సాధించిందేం లేదు
దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్ రెడ్డి(Revanth Reddy) ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని ఏడాది పూర్తికావొస్తోందని, ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి సాధించిందేమీ లేదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్(Laxman) ఘాటు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ ఆధ్వర్యంలో గోషామహల్‌కు చెందిన సీనియర్ నాయకుడు పురుషోత్తం తన అనుచరులతో కలిసి సోమవారం కాషాయతీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి లక్ష్మణ్ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రజాతీర్పును శిరసా వహించిందని, కాంగ్రెస్.. ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారెంటీల అమలుకు ఒక జాతీయ పార్టీగా కావాల్సిన గడువును రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయినా, 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేదని ఫైరయ్యారు.
రూ.2 లక్షల చొప్పున రూ.31 వేల కోట్ల మేర రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి.. కేవలం రూ. 17 వేల కోట్లతో కాంగ్రెస్ సర్కారు సరిపెట్టిందని ఆయన విమర్శలు చేశారు. దీంతో 50 శాతం మంది రైతులు చేసిన అప్పులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని, కొదరు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలోనే సుమారు 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని లక్ష్మణ్ తెలిపారు. బీఆర్ఎస్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేయడంతో బీఆర్ఎస్‌ను ఓడించారన్నారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి, రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మోసం చేశారని పేర్కొన్నారు.
ప్రజలను వంచించి మోసం చేయడమే కాంగ్రెస్ గ్యారంటీ అని లక్ష్మణ్ మండిపడ్డారు. అవినీతి, కుంభకోణాలకు గ్యారెంటీ కాంగ్రెస్ అని ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టి మరల్చేలా హైడ్రా, మూసీ ప్రక్షాళన, ఫోర్త్ సిటీ పేరుతో రకరకాల విన్యాసాలు చేస్తున్నారని చురకలంటించారు. కాంగ్రెస్ ఏడాది పాలన గడిచిపోయిందని, హామీలను అమలు విస్మరించిన కాంగ్రెస్‌పై ప్రజల తిరుగుబాటు తప్పదని లక్ష్మణ్ హెచ్చరించారు.