Manipur : మణిపూర్ కు 50 కంపెనీల అదనపు బలగాలు

by M.Rajitha |
Manipur : మణిపూర్ కు 50 కంపెనీల అదనపు బలగాలు
X

దిశ, వెబ్ డెస్క్ : మణిపూర్‌(Manipur) మళ్లీ అల్లర్లు చెలరేగుతున్న.. నేపథ్యంలో మరో 50 కంపెనీల సీఆర్పీఎఫ్‌(CRPF), బీఎస్‌ఎఫ్‌(BSF) బలగాలను మణిపూర్ కు పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Sha) ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి.. మణిపూర్‌లో శాంతిభద్రతలను సమీక్షించారు. అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మరో 50 కంపెనీల బలగాలను పంపాలని నిర్ణయించారు. 35 కంపెనీల సీఆర్పీఎఫ్‌, 15 కంపెనీల బీఎస్‌ఎఫ్‌ బలగాలను పంపనున్నారు. మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో చెలరేగిన హింసాకాండ ఇతర ప్రాంతాలకు విస్తరించిన కారణంగా అక్కడ కేంద్ర బలగాలను మోహరించడం ఇది రెండోసారి. ఇదివరకే నవంబర్ 12న 15 సీఆర్పీఎఫ్‌, 5 బీఎస్‌ఎఫ్‌ యూనిట్లను మణిపూర్‌కు పంపింది. దీంతో ఆ రాష్ట్రంలో కంపెనీల బలగాల సంఖ్య 218కి చేరింది.

Advertisement

Next Story

Most Viewed