- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సాహిత్యంలో రాణిస్తున్న ఏర్గట్ల విద్యార్థులు
దిశ, ఏర్గట్ల : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కమలాకర మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం బాలరత్న పురస్కారం అందిస్తుంది. అందులో భాగంగా 2024 సంవత్సరానికి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న నూనె శ్రీనిధి బాలరత్న, బాల ప్రతిభ పురస్కారానికి ఎంపికైనట్లు సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తమ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో భాగంగా..నూనె శ్రీనిధి కరాటే రంగంలో చక్కని ప్రతిభ కనబరిచి అనేక ప్రశంసలు అందుకోవడమే కాకుండా బ్లాక్ బెల్ట్ సాధించింది. పాఠశాల గౌరవాన్ని నిలబెట్టిందన్నారు. నవంబర్ 19న హైదరాబాదులోని శ్రీకృష్ణ దేవరాయల తెలుగు భాషా నిలయంలో ప్రముఖుల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని శ్రీనిధికి అందజేస్తారని పేర్కొన్నారు. విద్యార్థులను సాహిత్యంలో ప్రోత్సహిస్తున్న ప్రవీణ్ శర్మను, బాలరత్న, బాల ప్రతిభ పురస్కారానికి ఎంపికైన శ్రీనిధిని పాఠశాల ఉపాధ్యాయ బృందం మునిరుద్దీన్, పవన్, ప్రసాద్, రాజనర్సయ్య, రాజేందర్, గంగాధర్, రాజశేఖర్, శ్రీనివాస్, సబిత, కోమలి అభినందించారు.