ఆర్సీబీ బౌలింగ్ కోచ్‌గా ఓంకార్ సాల్వి

by Harish |
ఆర్సీబీ బౌలింగ్ కోచ్‌గా ఓంకార్ సాల్వి
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ముంబై హెడ్ కోచ్‌ ఓంకార్ సాల్విని బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని ఆర్సీబీ సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఓంకార్ సాల్వికి దేశవాళీలో కోచ్‌గా అపార అనుభవం ఉంది. ప్రస్తుతం అతను ముంబైకి హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది అతని మార్గదర్శకత్వంలో 8 ఏళ్ల తర్వాత ముంబై జట్టు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. అంతేకాకుండా, ఇరానీ కప్‌ టైటిల్‌ కూడా గెలిచింది. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో పనిచేశాడు. ఓంకార్ సాల్విపై ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ నమ్మకం ఉంచాడు. టైటిల్ నిరీక్షణకు తెరదించడంలో అతను కీలక పాత్ర పోషిస్తాడని చెప్పాడు.

Advertisement

Next Story