- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Air Passengers: దేశీయ విమాన రంగం సరికొత్త రికార్డ్.. ఒకే రోజు 5 లక్షల మంది ప్రయాణం..!
దిశ,వెబ్‌డెస్క్: మన దేశంలో ఇటీవల కాలంలో విమానాల్లో ట్రావెల్(Travel) చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. మిడిల్ క్లాస్(Middle Class) వాళ్లు కూడా విమానాల్లో ప్రయాణించేలా పలు విమానయాన సంస్థలు(Airlines) ఫ్లైట్ టికెట్ల(Flight Tickets)పై ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీంతో వీటిలో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. దేశీయ విమాన రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. నవంబర్ 17న(ఆదివారం) 5 లక్షల మందికి పైగా విమానాల్లో ప్రయాణం చేశారు. ఒక రోజులో 5 లక్షల మంది ప్రయాణించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ(Ministry of Civil Aviation) తెలిపిన వివరాల ప్రకారం నిన్న ఒక్కరోజే దాదాపు 3,173 విమానాల్లో 5,05,412 మంది ప్రయాణం చేశారు. అన్ని విమానాల్లో 90 శాతంపైన ఆక్యుపెన్సీ(Occupancy) నమోదవగా, పలు కారణాలతో సర్వీసులన్నీ ఆలస్యంగానే నడిచాయి. దేశ వ్యాప్తంగా ఫెస్టివల్స్(Festivals), పెళ్లిళ్ల(Marriages) సీజన్ కారణంగానే ఈ డిమాండ్ పెరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. శీతాకాలంలో ఇంత మంది ప్రయాణం చేయడం ఇదే ఫస్ట్ టైం అని, ఇదే డిమాండ్ వింటర్ సీజన్(Winter Season) అంతా కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు ప్రముఖ ట్రావెల్ పోర్టల్ క్లియర్ ట్రిప్ వైస్ ప్రెసిడెంట్(Clear trip Vice President) గౌరవ్ పట్వారీ(Gaurav Patwari) ఆశాభావం వ్యక్తం చేశాడు.