- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మద్దతు ధరపై పత్తి పంటను కొనుగోలు చేయాలి : జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
దిశ, ఖమ్మం రూరల్ : జిన్నింగ్ మిల్లులకు వచ్చే పత్తి పంటను మద్దతు ధరపై కొనుగోలు చేయాలని, తేమ శాతం ఆధారంగా రైతులకు చెల్లింపులు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్, ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు జిన్నింగ్ మిల్లును అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పత్తి పంట ఎన్ని ఎకరాలలో పండించారు, ఎప్పుడు తీసుకొని వచ్చారు, తేమ శాతం ఎంత ఉంది, మొదలగు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.పత్తి పంట 8 శాతం తేమ ఉంటే క్వింటాల్ 7521 రూపాయల మద్దతు ధర వస్తుందని, 8 నుంచి 12 శాతం వరకు పెరిగే ఒక్కో శాతానికి 75 రూపాయల చొప్పున క్వింటాల్ కు మద్దతు ధర తగ్గించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
జిన్నింగ్ మిల్లుకు వచ్చిన తర్వాత తేమ శాతం రాని పక్షంలో రైతులు రవాణా ఖర్చులు నష్టపోతున్నారని, గ్రామాల వద్ద, రైతుల పొలాల వద్దే తేమ శాతం పరిరక్షించేందుకు గల అవకాశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పత్తి పంట అధికంగా పండే గ్రామాలలో అదనంగా తేమ శాతం యంత్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రైవేట్ వ్యాపారస్తులు తేమ శాతం చూడకుండా కొంటున్నారని, దీని వల్ల రైతులు నష్టపోతారని, రైతులు పత్తి పంట ఆరబెట్టుకుని సీసీఐ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు పత్తి విక్రయించాలని, మద్దతు ధర కంటే ఎక్కువ వస్తేనే ప్రైవేట్ వ్యాపారస్తులకు పత్తి అమ్మాలని కలెక్టర్ సూచించారు. జిన్నింగ్ మిల్లులకు వచ్చే రైతులకు టోకెన్ జారీ చేసి ఎప్పటికప్పుడు తేమ శాతం పరిశీలించి నాణ్యమైన పత్తి కొనుగోలు చేయాలని అన్నారు.
కౌలు రైతుల వద్ద నుంచి కూడా పంట కొనుగోలుకు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.అనంతపురం జిల్లా కలెక్టర్ జిన్నింగ్ మిల్లులో పత్తి ప్రాసెసింగ్, ప్యాకింగ్ తీరును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనిఖీ సమయంలో జిన్నింగ్ మిల్ వద్ద మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బి. హరినాథ్ బాబు, సెక్రటరీ పి. వీరాంజనేయులు, తల్లంపాడు ఏఈఓ వి. హిమ బిందు, ఖమ్మం రూరల్ ఎం.ఏ.ఓ. జే. ఉమా నగేష్, అధికారులు, రైతులు, తదితరులు ఉన్నారు.