Congress: ఆ విషయంలో ప్రజలే మాకు బ్రాండ్ అంబాసిడర్లు.. మంత్రి శ్రీధర్ బాబు

by Ramesh Goud |   ( Updated:2024-11-18 15:14:48.0  )
Congress: ఆ విషయంలో ప్రజలే మాకు బ్రాండ్ అంబాసిడర్లు.. మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) చేసే మంచి పనులకు ప్రజలే(People) బ్రాండ్ అంబాసిడర్లు(Brand Ambassadors) అని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(IT Minister Duddilla Sridhar Babu) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు వరంగల్ లో జరగబోయే సభ ఏర్పాట్లను మంత్రి కొండా సురేఖతో కలిసి శ్రీధర్ బాబు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి ఎప్పుడు కూడా ప్రచారం(Campaign) చేసుకోవాలని ఉండదని, ప్రజలకు మేలు చేసామా లేదా? పేదలకు ఇళ్లు వచ్చిందా? కరెంట్ వచ్చిందా? రైతులకు మేలు జరుగుతుందా? అనేది మాత్రమే చూస్తామని చెప్పారు. ప్రచారంలో బీఆర్ఎస్ తో పోలిస్తే నిజంగానే వెనుకబడి ఉన్నామని తెలిపారు. అంతేగాక బీఆర్ఎస్(BRS) ఒక్క రూపాయి అభివృద్ది చేస్తే వంద రూపాయల ప్రచారం చేసుకుందని, కానీ మేము అలా కాదని, వంద రూపాయల అభివృద్ది చేసినా ఒక్క రూపాయి ప్రచారం కూడా చేసుకోలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఇక మాకు ప్రచారాల మీద ధ్యాస లేదని ప్రజలకు మంచి చేయాలనే దానిపైనే ధ్యాస ఎక్కువ ఉందని, ప్రజలే మాకు బ్రాండ్ అంబాసిడర్లు అని శ్రీధర్ బాబు మీడియాతో అన్నారు.

Advertisement

Next Story