- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
RRR: ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో మరో ముందడుగు.. ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఐఏఎస్ హరిచందన
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ అభివృద్ది(Hyderabad Development)లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు(Regional Ring Road Project) విషయంలో మరో ముందడుగు పడింది. దీనిని పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్(RRR) ప్రాజెక్టుకు డైరెక్టర్ ను నియమించింది. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్(RRR Project Director) గా ఐఏఎస్ హరిచందన(IAS Harichandana)ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే ఈ ప్రాజెక్టులో దక్షిణ భాగానికి(Southern Part) కన్సల్టెంట్(Consultant) నియామకం టెండర్ల(Tenders)కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు చేపట్టేందుకు ఆర్ అండ్ బీ(R&B)కి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఈ ప్రాజెక్టు దక్షిణ భాగానికి డీపీఆర్(DPR) సహా సాంకేతిక, ఆర్థిక సిఫార్సులను కన్సల్టెంట్ టెండర్లు దక్కించుకున్న కంపెనీ చేయనుంది. కాగా రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును ప్రభుత్వం ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మిస్తున్నారు. ఉత్తర భాగానికి ఇప్పటికే కేంద్రం నుంచి నేషనల్ హైవే హోదా లభించగా.. దక్షిణ భాగం అలైన్‌మెంట్ విషయంలో ప్రస్తుతం తీవ్ర కసరత్తులు చేస్తోంది.