భారీ గుట్కా డంప్‌ స్వాధీనం

by Naveena |   ( Updated:2024-11-18 14:29:33.0  )
భారీ గుట్కా డంప్‌ స్వాధీనం
X

దిశ,నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట జిల్లా కేంద్రంలో గుట్కా దందా జోరుగా కొనసాగుతుందని పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో సత్యసాయి కాలనీకి చెందిన పూరి శ్రీధర్ తన రేకుల షెడ్డులో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లన (విమల్, సాగర్) లను నిల్వ ఉంచాడు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు ఉమ్మడిగా దాడులు నిర్వహించి..గుట్కా డంప్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గుట్కా ప్యాకెట్ల విలువ రూ. 6 లక్షల 80 వేల 460 ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. గుట్కా డంప్ నిల్వ ఉంచిన పూరి శ్రీధర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టౌన్ ఎస్సై అందే వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

Next Story