- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Campaign: రెండు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారపర్వం.. జార్ఖండ్‌లో చప్పగా కాంగ్రెస్ ప్రచారం
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర(Maharashtra Elections), జార్ఖండ్(Jharkhand Elections) అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. సోమవారం సాయంత్రానికి రెండు రాష్ట్రాల్లో క్యాంపెయినింగ్ పూర్తయింది. 48 గంటల సైలెంట్ పీరియడ్ తర్వాత 20వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు, జార్ఖండ్ అసెంబ్లీ రెండో విడత ఎన్నికలో భాగంగా 38 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. తొలి విడతలో భాగంగా 43 సీట్లకు నవంబర్ 13వ తేదీనే పోలింగ్ జరిగింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడుతాయి.
మహా జోరు:
మహారాష్ట్రలో అధికారపక్షం(మహాయుతి-బీజేపీ, శివసేన(షిండే వర్గం), ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం)) శాయశక్తులను ప్రచారానికి ఒడ్డింది. రెండున్నరేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా నెలవారీగా మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తున్న లడ్కీ బహిన్ పథకాన్ని తరుచూ ప్రస్తావించింది. బీజేపీ సొగసైన స్లోగన్‌లు ఇచ్చింది. ప్రతిపక్ష అజెండాను చావుదెబ్బతీసేలా బాటేంగేతో కటేంగే, ఏక్‌హైతో సేఫ్ హై వంటి నినాదాలను ఆ పార్టీ అగ్రనేతలు ఇచ్చారు. బాటేంగేతో కటేంగే నినాదంపై మిత్రపక్షం ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అభ్యంతరం తెలిపినా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సర్దిచెబుతూ సమర్థించుకున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా, యూపీ సీఎం యోగిలు సుడిగాలి పర్యటనలు చేశారు. ఇక ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ(శరద్ పవార్ వర్గం))లు సామాజిక న్యాయం, కుల గణన, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలు విస్తృతంగా ప్రచారం చేసింది. బీజేపీ నినాదాలకూ గట్టి కౌంటరే ఇచ్చింది. మహాయుతికి ప్రజా సంక్షేమం కంటే వారి దోస్తులు కార్పొరేట్ దిగ్గజాలే ప్రియం అని ప్రచారం చేసింది.
జేఎంఎంపైనే భారం?
జార్ఖండ్ అధికారపక్షం ప్రచార భారం ఎక్కువగా జేఎంఎంపైనే పడింది. కాంగ్రెస్ కేవలం ఆ పార్టీ అభ్యర్థుల వరకే క్యాంపెయినింగ్ పరిమితం చేసుకుంది. అది కూడా చాలీచాలనట్టుగానే ప్రచారం చేసిందని సొంత పక్షం నుంచే విమర్శలు వస్తున్నాయి. ఇక ఇండియా కూటమి పక్షాలకు కాంగ్రెస్ ప్రచారం చేయలేదు. ప్రచార భారం ఎక్కువగా సీఎం హేమంత్ సోరెన్ భుజాన వేసుకున్నారు. ఇక్కడా సహజ వనరుల దోపిడీ, బంగ్లాదేశ్ చొరబాటుదారులు, అవినీతి వంటి అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య ఘాటుగా ప్రచారం సాగింది.