- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మల్కాజిగిరిలో మొక్కుబడిగా ప్రజావాణి..
దిశ,మల్కాజిగిరి : మల్కాజిగిరి సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు తీరుపై పలువురు మండిపడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ప్రజావాణి కార్యక్రమాన్ని సర్కిల్ అధికారులు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్కిల్ డిప్యూటీ కమిషనర్ , సంబంధిత అధికారులు ప్రజావాణిలో పాల్గొనడం లేదని ఇదేమని ప్రశ్నిస్తే అప్పుడే కొందరు అధికారులు హాజరైతున్నారని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ తో పాటు పలువురు ఆరోపిస్తున్నారు.
ప్రజావాణి లో వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించే దశగా అధికారులు చర్యలు చేపట్టడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. సఫిల్ గూడ రైల్వే గేట్ -ఉత్తమ్ నగర్, సఫిల్ గూడ - కృపా కాంప్లెక్స్ తదితర మెయిన్ రోడ్లను మరమ్మత్తు చేయాలనీ, చాణక్య పురి, ఇతర కాలనీల్లో ప్రభుత్వ స్థలాలను జియో టాగ్ చేసి, ప్రహరీ గోడను ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ శ్రవణ్ కోరారు. అక్రమ నిర్మాణాల పై చెర్యలు చెప్పట్టాలని, ఓపెన్ స్థలాలలో శానిటైజేషన్, క్లీనింగ్ పనులు నిర్వహించాలని కోరారు.
కనిపించని టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులు..
గత ప్రజా వాణి లో లాగానే షరా మామూలుగానే టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ లో ఈ. ఈ మినహా మిగతా అధికారులు గై హాజరయ్యారు. సర్వే పై మీటింగ్ పేరుతో ప్రజావాణి కార్యక్రమానికి కాలయాపన తప్పలేదు. గంటల తరబడి ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన ప్రజలు కార్యాలయం బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రాజు, ఈ. ఈ లక్ష్మణ్, , మహేశ్వరి, దయానంద్, మంజుల తదితరులు పాల్గొన్నారు. కాగా గైర్ హాజరవుతున్న ఇంజనీరింగ్ , టౌన్ ప్లానింగ్ అధికారుల పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఆర్కే నగర్ సీనియర్ సిటిజన్లు ఇచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఎందుక స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజావాణిలో తొమ్మిది ఫిర్యాదులు వచ్చినట్టు అందులో టాక్స్ విభాగానికి చెందినవి 2, ఇంజనీరింగ్ సెక్షన్ కు చెందినవి 2, టౌన్ ప్లానింగ్ వి 3, యూజీడీ 1, వెటర్నరీ కి సంబంధించినది 1 గా డీసీ తెలిపారు.