- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: నిజంగా ఆ సత్తా రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంది.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(KTR) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో లగచర్ల బాధితులతో కలిసి కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం గిరిజన మహిళలపై చేసిన అఘాయిత్యాలను ఢిల్లీ వేదికగా దేశ ప్రజందరికీ తెలిసేలా చేసేందుకే ఇక్కడికి వచ్చామని అన్నారు. 50, 60 ఏళ్లుగా ఇదే భూమిపై గిరిజనులు ఆధారపడి జీవిస్తున్నారు. ప్రాణం పోయినా ఆ భూములు ఇవ్వబోమని అంటున్నారు.. అయినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిపై దౌర్జన్యం చేస్తోందని తెలిపారు. కొడంగల్‌లో ఓటు వేసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింనందుకు వారికి అర్ధరాత్రి కరెంట్ లేకుండా చేస్తున్నాడని కీలక ఆరోపణలు చేశారు. 9 నెలల గర్బిణీ అయిన జ్యోతి అనే మహిళ భర్తను దారుణంగా కొట్టి అరెస్ట్ చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన దౌర్జన్యాలను మానవహక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్‌ను కలిసి న్యాయం చేయాలని వారంతా విజ్ఞప్తి చేశారని తెలిపారు.
రేవంత్ రెడ్డి అల్లుడి కోసం పెట్టే ఫార్మా కంపెనీ కోసం మా గిరిజనులను రోడ్డమీదకు లాక్కొస్తారా? అని ప్రశ్నించారు. స్వయంగా ముఖ్యమంత్రి సోదరుడే బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎంతో పురోగతి సాధించిన తెలంగాణలో ఇవాళ అరాచకం నడుస్తోందని తెలిపారు. పోలీసులు రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసలు తెలంగాణలో బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంగా మారిందని ప్రధాని మోడీ అంటారు. కానీ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. గిరిజనులపై పోలీసులే లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. కేంద్రానికి మనసుంటే ఈ విషయంలో వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయమని చెబుతారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
‘రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా వాళ్ల ఫ్యామిలీ ప్యాకేజ్‌గా మార్చేస్తున్నారు. కేసీఆర్ రైట్ అంటే రేవంత్ రెడ్డి లెఫ్ట్ అనాలనే ఒక పాలసీ పెట్టుకున్నారు’ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపర్చాల్సిన అవసరం మాకు లేదు. ఆయనే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటాడని, ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆ తర్వాత బీఆర్ఎస్ 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీకి కావాల్సిన మూటలు అందించగల సత్తా ఉన్నది రాష్ట్రంలో ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే అని తీవ్ర స్థాయిలో సెటైర్లు వేశారు.