Indian Students : అమెరికా కాలేజీల్లో అడ్మిషన్లు.. చైనాను దాటేసిన భారత్

by Hajipasha |
Indian Students : అమెరికా కాలేజీల్లో అడ్మిషన్లు.. చైనాను దాటేసిన భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా కాలేజీలు, యూనివర్సిటీ(US Colleges)ల్లో చేరుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే(Indian Students) అత్యధికంగా ఉన్నారు. ఈవిషయంలో గతంలో నంబర్ 1 స్థానంలో చైనా ఉండగా.. ఇప్పుడా ప్లేసును భారత్ కైవసం చేసుకుంది. 2023-2024 విద్యా సంవత్సరంలో అమెరికా కాలేజీల్లో దాదాపు 3.31 లక్షల మంది భారతీయ స్టూడెంట్స్ చేరగా, 2.77 లక్షల మంది చైనా విద్యార్థులు చేరారు. దీంతో అమెరికాలో విదేశీ విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్యపరంగా 2009 సంవత్సరం తర్వాత తొలిసారిగా చైనాను భారత్ అధిగమించింది.

చైనా విద్యార్థుల అడ్మిషన్లు 4 శాతం మేర తగ్గాయి. గత విద్యా సంవత్సరం(2023-2024)లో అమెరికాలోని విద్యాసంస్థల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 23 శాతం మేర పెరిగింది. మొత్తం మీద ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే విదేశీ విద్యార్థుల సంఖ్య 7 శాతం పెరిగి 11 లక్షలు దాటింది. కరోనా సంక్షోభం తర్వాత అగ్రరాజ్యంలో ఇంత భారీ సంఖ్యలో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు జరగడం ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్’ సంస్థ ఈవివరాలను వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed