Lunar Eclipse: నేడే చంద్ర గ్రహణం.. ఈ ఒక్క పరిహరం పాటిస్తే ఏడాదంతా ఇంట్లో డబ్బుల వర్షమే..!

by Prasanna |   ( Updated:2025-03-14 02:56:20.0  )
Lunar Eclipse: నేడే చంద్ర గ్రహణం.. ఈ ఒక్క పరిహరం పాటిస్తే ఏడాదంతా ఇంట్లో డబ్బుల వర్షమే..!
X

దిశ, వెబ్ డెస్క్ : హోలీ అనేది రంగులతో జరుపుకునే పండుగ. మధుర, బృందావన్‌లలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. అయితే, ఈ సంవత్సరం ఈ రోజు జరుపుకోబోతున్నారు. అదే విధంగా ఈ సారి ఇదే రోజున చంద్ర గ్రహణం సంభవించబోతుంది. దీని ప్రభావం 12 రాశుల వారి మీద పడనుంది. ముఖ్యంగా, హోలీ పండగ రోజున కొన్ని రాశుల వారు వీటిని పాటించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు రంగులతో హోలీని ఆడుకుంటారు. హోలీ సందర్భంగా రంగులను పూసుకుంటారు. 12 రాశుల వారు ఈ పాటించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. మేషం, కన్య, సింహం రాశి వారు.. పేద వాళ్ళకి బియ్యాన్ని దానంగా ఇవ్వాలి, అలాగే కొత్త బట్టలు, పాలను దానంగా ఇస్తే మీ వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు తొలగిపోతాయి. మిథునం, కర్కాటకం రాశుల వారు హోలీ రోజున చంద్రగ్రహణ ప్రభావం నుంచి బయటపడాలంటే .. అన్నదానం చేయాలి.

అంతే కాకుండా.. తుల, ధనస్సు రాశి వారు పేదలకు అన్నం, పెరుగు దానంగా ఇవ్వాలి. ఇలా చేయడం వలన ఈ రాశుల వారికి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. కుంభం, మీన రాశి వారు..హోలీ చంద్ర గ్రహణం ప్రభావం పడకుండా ఉండాలంటే.. ఈ రోజున సాయంత్రం 50 మందికి అరటి పళ్ళు, మజ్జీగను దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే, లక్ష్మి దేవి అనుగ్రహం కలిగి డబ్బుకి సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Read More..

Todays Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 14-03-2025)



Next Story

Most Viewed