- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TTD UPDATE: హోలీ పండుగ ఎఫెక్ట్.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్ధీ

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు(మర్చి 14) హోలీ పండుగ (Holi festival) కావడం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం సెలవు ఉండటంతో ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanam) భక్తుల పోటెత్తారు. గురువారం రాత్రి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుని ఈ రోజు ఉదయం దర్శనం కోసం బారులుతీరారు. దీంతో 31 కంపార్ట్మెంట్లలో (31 compartments) భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టనున్నట్లు టీటీడీ అధికారులు (TTD officials) తెలిపారు. ఇదిలా ఉంటే గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు.. స్వామివారిని 51,148 మంది భక్తులు దర్శించుకున్నారు.
వీరిలో 21,236 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. దీంతో నిన్న ఒక్కరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanam) హుండీల ద్వారా రూ.3.56 కోట్ల ఆదాయం (Income of Rs. 3.56 crores) వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే ఇవాళ రేపు భక్తుల రద్దీ విపరీతంగా ఉండనుండటంతో.. అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రం పూట వర్షాలు, పగటిపూట భారీగా ఎండలు కొడుతుండటంతో.. భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.