- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాష్ట్రంలో మరో మూడు కొత్త మున్సిపాలిటీలు

దిశ, మేడ్చల్ బ్యూరో: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో కొత్తగా మరో మూడు కొత్త మున్సిపాలిటీల ఏర్పా టుకు రాష్ట్ర సర్కార్ చర్యలు చేపట్టింది. జిల్లాలోని మూడు చింతలపల్లి, ఎల్లంపేట, అలియాబాద్‌ను మున్సిపా లిటీ చేసేందుకు కేబినెట్ ఆమోదం పొందినట్లు తెలిసింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల వెల్లడిస్తున్నాయి. బిల్లు ఆమోదం పొందితే మేడ్చల్ జిల్లా పూర్తిగా పట్టణ ప్రాంతంగా మారుతుంది.
జిల్లాలో మేడ్చల్, శామీర్ పేట, మూడు చింతలపల్లి మూడు రూరల్ మండలాల్లో 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే మేడ్చల్ కేంద్రంగా ఇప్పటికే మున్సిపాలిటీ ఏర్పడడంతో మిగిలిన 12 గ్రామాలతో ఎల్లంపేట కేంద్రంగా మరో మున్సిపాలిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇదే విధంగా శామీర్‌పేట మండలంలో ఏర్ప డిన తూంకుంట మున్సిపాలిటీలో శామీ ర్‌పేట గ్రామాన్ని విలీనం చేశారు. దీంతో మిగిలిన గ్రామాలతో కలిపి అలియాబాద్ కేంద్రంగా కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయబోతున్నారు. వీటితో పాటు మూడు చింతల పల్లి మండల కేంద్రంగా ఆ మండలంలోని గ్రామాలన్నీ కలిపి మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.
పట్టణీకరణ దిశగా..
మున్ముందు జిల్లాలో గ్రామ పంచాయతీ లు, గ్రామీణ మండలాలు కనుమరుగు కానున్నాయి. గత పంచాయతీ ఎన్నికల నాటికి జిల్లాలో 61 గ్రామ పంచాయతీ లు, 5 గ్రామీణ మండలాలు ఉండేవి. వీటిలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల, బయట ఉన్న 28 గ్రామాలను గతేడాది సెప్టెం బర్‌లో సమీపంలో ఉన్న 7 మున్సిపాలిటీలలో విలీనం చేశారు. విలీనంతో 33 గ్రామాలు మాత్రమే మిగిలి ఉండగా, కొత్తగా మరో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో 34 గ్రామ పంచాయతీలు, 3 మండలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
పాలన సౌలభ్యం కోసమే..
జిల్లాలో గ్రామీణ మండలాలుగా శామీర్ పేట, మేడ్చల్, మూడు చింతలపల్లి మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో జిల్లా పరిషత్ ఏర్పాటు చేయాలన్నా.. పంచాయతీరాజ్ వ్యవస్థను కొనసాగించాలన్నా సమ స్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార యంత్రాంగం భావిస్తోంది. జిల్లా పరిషత్ పాలక మండలి ఏర్పాటు కోసం సరిపడా జడ్పీటీసీలు లేకుండా పోయారు. ఉదాహరణకు జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు కూడా జడ్పీటీసీలు కావాల్సి ఉంటుంది. ప్రస్తుత మండలాల ప్రకారం ఆ తర్వాత ఒక్క జడ్పీటీసీ సభ్యుడు మాత్రమే మిగులుతారు. అదే సమయంలో జడ్పీలో వివిధ శాఖలపై సమీక్షించేందుకు ఏడు రకాల కమిటీలు ఉంటాయి. వీటికి ఒక్కో జడ్పీటీసీ సభ్యుడు ఒక్కోదానికి ప్రతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ముగ్గురు జెడ్పీటీసీ సభ్యుల కోసం జడ్పీ సీఈవో, డీపీవో, డీఎల్పీవో, ఎంపీడీవోలు, ఎంపీవో, ఇతర సిబ్బంది, అధికారులు ప్రత్యేక వ్యవస్థ కావాలి. ముగ్గురు జడ్పీటీసీల కోసం జడ్పీ సమావేశం నిర్వహించా లి. వీటి నేపథ్యంలో జిల్లాను మొత్తం పట్టణ ప్రాంతంగా మారిస్తే మంచి ఫలితం ఉంటుందని అంచనా వేసి కొత్తగా మొత్తం పంచాయతీలతో 3 మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త మున్సిపాలిటీలు
శామీర్‌పేట, మేడ్చల్, మూడు చింతలపల్లి గ్రామీణ మండలాల్లోని 34 గ్రామ పంచాయతీలతో కొత్తగా ఏర్పాటు చేయనున్న అలియాబాద్, ఎల్లంపేట, మూడు చింతలపల్లి మున్సిపాలిటీల్లో ఈ గ్రామాలను విలీనం చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
మండలం మున్సిపాలిటీ విలీన గ్రామాలు
శామీర్‌పేట అలియాబాద్ తుర్కపల్లి, లాగ్ గడిమలక్ పేట, మజీద్ పూర్, మురహరిపల్లి, యాదారం, పొన్నాల మూడుచింతలపల్లి, మూడుచింతలపల్లి లింగాపూర్, ఉద్దేమర్రి, కేశవరం, నాగిశెట్టిపల్లి, కొల్తూర్, నారాయణపూర్, పోతారం, అనం తారం, లక్ష్మాపూర్, అద్రాస్‌పల్లి, ఎల్లగూడ, జగ్గంగూడ, సంపనబోలు, కేశవాపూర్
మేడ్చల్ ఎల్లంపేట శ్రీరంగవరం, బండమాధరం, నూతన్‌కల్,
మైసిరెడ్డిపల్లి, కోనాయిపల్లి, సోమారం,
రావల్ కోల్, కండ్లకోయ, రాజ్ బొల్లారం,
ఘన్‌పూర్, గోసాయిగూడ