టీకా పంపిణీ వదిలేసి ‘బ్లూ టిక్‌’ల కోసం ఆరాటం

by Shamantha N |
టీకా పంపిణీ వదిలేసి ‘బ్లూ టిక్‌’ల కోసం ఆరాటం
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎత్తిచూపారు. దేశంలో టీకా పంపిణీపై దృష్టిసారించాల్సిన సమయంలో ట్విట్టర్ ఖాతాల్లో బ్లూ టిక్‌ల కోసం మోదీ ప్రభుత్వం ఆరాటపడుతున్నదని విమర్శించారు. ‘మోడీ ప్రభుత్వం బ్లూ టిక్‌ల కోసం ఫైట్ చేస్తు్న్నది. మీకు కొవిడ్ టీకా కావాలా? అయితే, మీకు మీరుగా ఆత్మనిర్భరత సాధించుకోండి’ అంటూ హిందీలో ట్వీట్ చేశారు. ప్రయారిటీస్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్వీట్‌కు జతచేశారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ఇతర నేతల ట్విట్టర్ ఖాతాలకు బ్లూ టిక్ బ్యాడ్జీలు శనివారం తొలగించిన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ మళ్లీ గంటల వ్యవధిలో రీస్టోర్ చేసింది. కనీసం ఆరు నెలల్లోపు లాగిన్ కాకుంటే ఆటోమేటిక్‌గా బ్లూ టిక్ తొలగించే మెకానిజం కారణంగా ఇవి తొలగిపోయాయని సంస్థ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed