- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మం జిల్లాలో విజృంభిస్తున్న కరోనా
దిశ, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గురువారం కొత్తగా ఖమ్మంలో 11కేసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 కేసులు, తొలి కరోనా మరణం చోటు చేసుకున్నాయి. అంతేగాకుండా జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని ఇద్దరు వైద్యులకు, ముగ్గురు హెడ్ నర్సులు, ఒక స్టాఫ్ నర్స్ ఆమె ఇద్దరి పిల్లలకు, శ్రీనివాసనగర్‌కు చెందిన మరో ఇద్దరు దంపతులకు, పెనుబల్లిలో ఒకరికి 1, నిర్వహించిన కరోనా పరీక్షల్లో వీరందరికీ పాజిటివ్ వచ్చింది. దీంతో ఖమ్మం జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 98కి చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం కొత్తగా 7కేసులు నమోదు కాగా అన్ని కూడా పాల్వంచ మండల కేంద్రానికి చెందినవే కావడం గమనార్హం. ఇందులో ఆరుగురికి గతంలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఒకే వ్యక్తి నుంచి వ్యాప్తి చెందినట్టుగా వైద్యులు గుర్తించారు. ఇంకొకరికి ఎలా సంక్రమించిందనే విషయాన్ని ట్రావెల్ హిస్టరీ ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడు కేసులతో భద్రాద్రి కొత్తగూడెంలో మొత్తం కేసుల సంఖ్య 35కు చేరుకుంది. ప్రస్తుతం 28 కేసులు ఆక్టివ్‌గా ఉన్నాయి. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 126 కేసులు ఆక్టివ్‌గా ఉన్నాయి.