కరోనా ఇప్పటికిప్పుడు పోయే పరిస్థితిలేదు: మంత్రి సత్యవతి

by Shyam |
కరోనా ఇప్పటికిప్పుడు పోయే పరిస్థితిలేదు: మంత్రి సత్యవతి
X

దిశ, వరంగల్: కరోనా వైరస్ ఒక కొత్త వ్యాధి.. ఇప్పటికిప్పుడు పోయే పరిస్థితి లేదు, ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ ఆ మహమ్మారి మన దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆమె చెప్పుకొచ్చారు. శనివారం మహబూబాబాద్ జిల్లా గూడూరులో రేషన్ కార్డు లేని పేదలకు శనివారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను మంత్రి సత్యవతి రాథోడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనకు తెలవని ఒక వైరస్ ఎక్కడో చైనాలో పుట్టి వివిధ దేశాల మీదుగా ఇక్కడ చేరిందని, లాక్ డౌన్ లో దేశవ్యాప్తంగా పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని, మన రాష్ట్రంలో లాక్ డౌన్ లో పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. గిరిజన శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాలయాలు కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో మూసి వేసిన సందర్భంగా అక్కడ విద్యార్థుల కోసం నిల్వ ఉన్న నిత్యావసర వస్తువులను స్థానిక పేదలకు పంపిణీ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అందులో భాగంగా రేషన్ కార్డు లేని దాదాపు 284 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, స్థానిక అధికారులు, నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story