- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దశల వారీ క‘రోనా’..
దిశ, వెబ్‌డెస్క్:
ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న వైరస్ కరోనా (కోవిడ్-19). ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు ఇప్పటికే
తీసుకుంటున్నాయి. పలు రాష్ట్రాలు ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించాయి. ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి ఇప్పుడు భారత్‌లో ఏ దశలో ఉన్నది? ఎన్ని దశలు ఉన్నాయి? అనే అంశాలపై ‘దిశ’ ప్రత్యేక కథనం.
కరోనా వైరస్ దశలపై పలువురు నిపుణులకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మెజార్టీ అభిప్రాయంగా మూడు దశలున్నాయని
చెబుతున్నారు. మొదటి దశ నుంచి మూడో దశకు వైరస్ వ్యాప్తి చెందితే అదుపు అసాధ్యమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సందర్భంగా కరోనా
వైరస్ దశల గురించి తెలుసుకుందాం.
మొదటి దశ:
నవీన్(పేరు ఉదాహరణకు మాత్రమే) విదేశాల నుండి వచ్చారు. విమానాశ్రయంలో అతనికి జ్వరం లేదు. అతన్ని ఇంటికి
వెళ్లడానికి అనుమతించారు. కానీ, 14 రోజుల పాటు తన ఇంట్లోనే ఒక గదిలో పూర్తిగా ఒంటరిగా ఉండాలనీ, కుటుంబీకులకూ దూరంగా
ఉండాలని చెప్పారు. ఇంటిని వదిలి బయటకి వెళ్లొద్దనీ, ఒక వేళ జ్వరం వచ్చినప్పుడు తమ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని
చెప్పి విమానాశ్రయంలో అఫిడవిట్‌పై సంతకం చేయించుకుని అధికారులు ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన అతను అధికారులు
చెప్పినట్టు చేస్తుండగా..అతని తల్లి “హే, నీకు ఏమీ జరగలేదు”, “ఒంటరిగా ఉండకు. చాలా రోజులైంది ఇంటి ఆహారం తిని, రా కిచిన్ లో
నేను వేడి వేడి ఆహారాన్ని అందిస్తాను.” అని పిలిచింది. నవీన్ నిరాకరించారు.
మరుసటి రోజు ఉదయం తల్లి అదే మాట చెప్పింది.
కోపం వచ్చి తల్లి మీద అరిచాడు. తల్లి బాధపడింది. అయితే, నవీన్ మాత్రం ఒంటరిగానే ఉన్న 6-7 రోజుల తర్వాత అతడికి జ్వరం,
జలుబు దగ్గు వంటి లక్షణాలు వచ్చాయి. వెంటనే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశాడు. కరోనా పరీక్ష జరిగింది. అతను పాజిటివ్‌గా
మారిపోయాడు.
అతని కుటుంబీకులకూ పరీక్షలు చేయగా, అవన్నీ నెగెటివ్‌గా వచ్చాయి. 1 కిలోమీటర్ల వ్యాసార్థంలో పొరుగువారిని
ఎక్కువగా ప్రశ్నించారు. అలాంటి వారందరినీ పరీక్షించారు. వారికీ నెగెటివ్ అని తేలింది. అయితే, నవీన్ అధికారుల సూచనలు
పాటించడం ద్వారా కరోనా ఎవరికి వ్యాప్తి చెందలేదు. కరోనా పాజిటివ్‌గా తేలిన తర్వాత నవీన్ 7 రోజుల చికిత్స తర్వాత,
అతను పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అప్పుడు తల్లికి అర్థమయింది. మొదటి దశలో కనుక
నవీన్ సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోకపోతే కుటుంబీకులందరికీ ఈ మహమ్మారి సోకేదని..
అయితే, స్వీయ నియంత్రణ,
నిబంధనలు పాటించిన నవీన్‌ను ఆయన తల్లి, కుటుంబీకులు ఇరుగు పొరుగు వారు అభినందించారు.
రెండో దశ:
జబ్బు, దగ్గు లక్షణాలున్నా రాజు(ఉదాహరణకు తీసుకున్న పేరు)కు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది.
విదేశాలకు వెళ్లలేదనీ, కానీ, ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వ్యక్తిని(ఆభరణాల షాపు యజమాని) కలిశానని రాజు చెప్పాడు.
నగలు కొనడానికి ఒక ఆభరణాల షాపువద్దకు వెళ్లాడు. ఆ షాపు యజమాని ఇటీవల విదేశాల నుంచి వచ్చారు. ఆయన్ను విమానాశ్రయంలో
అధికారులు పరీక్షలు చేసి..14 రోజుల పాటు ఇంటి వద్దే ఉండాలని అఫిడవిట్‌పై సంతకం చేయించుకుని షరతులతో అనుమతించారు.
ఇబ్బందిగా ఉంటే హెల్ప్ లైన్‌ను సంప్రదించాలన్నారు. కానీ, అతను ఇవేవీ పట్టించుకోలేదు. కుటుంబీకులతో కలియ తిరిగాడు.
మరుసటి రోజు షాపుకూ వచ్చాడు. ఆరో రోజు ఆయనకు, కుటుంబీకులకు(వృద్ధ తల్లి) జ్వరం వచ్చింది. అందరినీ పరీక్షించగా
అందరూ కరోనా పాజిటివ్‌గా నిర్ధారించబడ్డారు. ఇతనితో పాటు షాపులో ఉన్న 450 మంది వర్కర్లు, కస్టమర్లు సంభాషించారు.
ఇప్పడు వారందరికీ కరోనా సోకే అవకాశమున్నది. ఇప్పడు భయం ఏమిటంటే, ఈ 450 మందిలో ప్రతి ఒక్కరికి
వారు ఎక్కడికి వెళ్ళారో తెలియకపోవచ్చు. వారందరూ ఈ మహమ్మారి విస్తరణకు అవకాశాలిస్తున్నారు. మొత్తంమీద స్టేజ్ 2
అంటే రెండో దశలో కరోనా పాజిటివ్‌లోకి ప్రవేశించిన వ్యక్తి విదేశాలకు వెళ్లకున్నా..వ్యాధి వస్తున్నది.
మూడో దశ:
జలుబు, దగ్గు, జ్వరం కారణంగా రాంసింగ్(ఉదాహరణకు తీసుకున్న పేరు) ఆస్పత్రి పాలయ్యాడు. ఆయన్ను పరీక్షించగా
కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే, రాంసింగ్ విదేశాలకు వెళ్లలేదు.
విదేశాల నుంచి వచ్చిన వారితో మాట్లాడలేదు. అయినా ఆయనకు
కరోనా వచ్చింది. మొదటి దశలో మనిషి స్వయంగా విదేశాల నుంచి వచ్చాడు. రెండో దశలో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి అజాగ్రత్త వల్ల
వ్యాధి ప్రబలింది. కానీ, మూడో దశలో సాధారణ వ్యక్తులతోనే మహమ్మారి వచ్చింది. ఉదాహరణకు ఆభరణాల షాపు 450 మంది
వర్కర్లు, కస్టమర్లు వీరందరూ ఇప్పుడు అతి ప్రమాదకరం. వీరందరి కోసం పోలీసులు, ఆరోగ్య శాఖ బృందం వెతుకుతోంది. ఆ పది మందిలో
ఎవరైనా దేవాలయంలోకి ప్రవేశిస్తే ఈ వైరస్ చాలా వ్యాపిస్తుంది.
ఇదే మూడో దశ. ఇక్కడ మూలం మీకు తెలియదు..
ఇక్కడ కట్టడికి చేయాల్సింది లాక్ డైన్ కర్ఫ్యూ మాత్రమే.. 14 రోజుల పాటు ప్రతి మనిషీ ఇంట్లో లాక్ చేయబడతాడు.
తద్వారా సోకిన వ్యక్తితో పరిచయం లేని వ్యక్తి సురక్షితంగా ఉంటాడు.
తెలియని మూలం కూడా అతని ఇంట్లో లాక్ చేయబడింది.
అతను అనారోగ్యానికి గురైనప్పుడు, అతను ఆస్పత్రికి వస్తాడు. అప్పుడు పరీక్షలు జరిపి కరోనా కట్టడికి కృషి చేయొచ్చు..
కావున లాక్ డౌన్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి. అయితే, అధికారులు ఇప్పటికే సూచించినట్టు సెల్ఫ్ క్వారంటైన్ కావడం,
విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు నిర్బంధంలో ఉండటం తప్పక పాటించాలి. రెండో దశను మూడో దశగా మార్చొద్దని
ప్రభుత్వాలు చేస్తున్న విజ్ఞప్తిని అందరం తప్పక పాటిద్దాం.. ఇంటి నుంచి బయటకు రాకుండా ఉందాం..
Tags: corona virus (covid-19), stages, very dangerous, hight alert world