- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నంపెట్టిన చేతులే.. ఆకలి తీర్చమంటున్నాయి !
దిశ, న్యూస్‌బ్యూరో: కష్టాన్నే నమ్ముకొని జీవించే బడుగు జీవుల బతుకులు బజారు పాలవుతున్నాయి. నిత్యం ఎంతో మంది కడుపు నింపేందుకు కారణమైన వారే.. ప్రస్తుతం కడుపు మాడ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. లాక్‌డౌన్‌తో సంస్థలన్నీ మూతపడటంతో హాస్టళ్లలో ఉండే వారంతా ఊళ్లకు చేరారు. కానీ అక్కడ వంట చేసేవారు, రోడ్లపై పలు సంస్థల వద్ద మెస్ బండి నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారి బతుకులు మాత్రం రోడ్డున పడ్డాయి.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో హాస్టల్స్‌కు భోజనం సప్లయి చేసేవారు, రోడ్లపై వివిధ సెంటర్ల వద్ద మెస్ బండ్లు పెట్టుకొని తక్కువ ధరకే భోజనం అందించే వారు వేలల్లో ఉన్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులో ఉండటంతో వీరికి కుటుంబ పోషణ కష్టంగా మారింది. సంస్థలన్నీ మూతపడి హాస్టళ్లన్నీ ఖాళీ అవడంతో వంట కార్మికులకు పనిలేకుండా పోయింది. హాస్టల్ యాజమాన్యాలు వారికి పనిలేదని చెప్పడంతో ఈ లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు ఎలా బతుకాలో తెలియక ఆ కుటుంబాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. చేసేందుకు ఏ పని లేక, చేతిలో చిల్లిగవ్వలేక నానా అవస్థలు పడుతున్నారు.
హాస్టల్ యజమానులే వంట మాస్టర్లు..
లాక్‌డౌన్‌కు ముందు 100 నుంచి 150 మంది ఉన్న హాస్టళ్లలో.. ప్రసుత్తం 5 నుంచి 10 మంది మాత్రమే ఉన్నారు. దీంతో హాస్టల్ యజమానులే వంట చేసుకుంటూ.. వంట మాస్టర్లను బయటికి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 15 రోజుల నుంచి ఓ వైపు పని లేక.. మరో వైపు చేతిలో రూపాయి లేక.. తిండికి తిప్పలు పడుతున్నామని కార్మికులు వాపోతున్నారు. నెల జీతం వస్తేగాని బతుకు బండి సాగని పరిస్థితిలో ఉన్నటుండి ఒక్కసారిగా పనిలేకుండా పోవడంతో దిక్కుతోచడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి అద్దె కూడా చెల్లించలేక పోవడంతో యజమానులు ఇంటి నుంచి గెంటివేసే పరిస్థితి నెలకొందని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ‘నిలువ నీడలేదాయె.. బుక్కెడు బువ్వలేకపాయే.. మా పిల్లలను ఎట్లా సాదాలి.. మేమెట్లా బతకాలి’ అని కార్మికులు కంటతడి పెడుతున్నారు. ప్రభుత్వం ఇస్తానన్న బియ్యం, పైసలు ఇంకా అందలేదు. 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంతో మెస్ బండ్ల వద్ద భోజనం చేసేవారెవరూ లేరు. అయినా ధైర్యం చేసి బండి నడుపుదామనుకుంటే పోలీసులు తరిమికొడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హాస్టల్ బంద్ పెట్టడంతో పనిలేకుండా పోయింది : హనుమంత రావు, వంట కార్మికుడు, వరంగల్
నేను హాస్టల్లో 8 ఏండ్లుగా వంట పనిచేస్తున్న, ఇది తప్ప నాకు మరో పని రాదు. 15 రోజుల నుంచి హాస్టల్లో ఎవరూ లేకపోవడంతో హాస్టల్ యజమాని పనికి రావొద్దని చెప్పాడు. ఇప్పుడు ఏ పనిచేయాలో తెలియడం లేదు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. కుటుంబం పోషణ కష్టంగా ఉంది. ఈ కరోనా వైరస్ ఎప్పుడు మాయమవుతుందో.. మాకు పని ఎప్పుడు దొరుకుతుందో అర్థం కావడం లేదు.
Tags: hostels, workers, lockdown, coronavirus,students, employees