కేటీఆర్‌కు ట్వీట్ ఎఫెక్ట్: సమస్య పరిష్కారానికి రెక్కలు

by Shyam |
ask ktr
X

దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణానికి చెందిన శంకర్ గౌడ్ అనే వ్యక్తి తన ఇంటి అనుమతి కోసం పర్మిషన్ ఇవ్వడానికి మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారంటూ సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్లో తన ఆవేదన వ్యక్తపరిచాడు. ఇంటి అనుమతి కోసం నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించినప్పటికీ ఇక్కడ తనకు అనుమతి ఇవ్వడం లేదంటూ కేటీఆర్ కు ట్విట్టర్ పోస్టు చేశాడు. కేటీఆర్ కు ట్వీట్ చేయడంతో షాద్‌నగర్ మున్సిపల్ కార్యాలయం వర్గాలు 45 రోజులుగా పట్టించుకోనిది ఆగమేఘాల మీద శంకర్ గౌడ్ కు అనుమతి ఇచ్చేశారు. దీంతో సమస్య పరిష్కారం కావాలంటే కార్యాలయం చుట్టూ తిరగడం మానేసి కేటీఆర్ కు ట్వీట్ చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయేమోనని ప్రజలు అంటున్నారు. అమాత్యులను సంప్రదిస్తే తప్ప అధికారులు పనులు చేయరా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story