- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ గడ్డపై ‘తమిళుల’ వైరం..
దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రంలో తమిళులు విభేదాలకు దిగుతున్నారు. తమిళుల వివాదాలకు రాజ్‌భవన్ వేదికగా మారుతోంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ మధ్య మాటల వైరం మొదలైంది. గవర్నర్‌పై విమర్శలు చేయడమే కాకుండా రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తోందంటూ ఆరోపణలు చేస్తున్నారు. నూతన వ్యవసాయ బిల్లుపై కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 2న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టి, గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. కొవిడ్-19 నేపథ్యంలో గవర్నర్ అపాయింట్‌మెంట్ లేదని, మెయిల్ ద్వారా వినతిపత్రం పంపించాలని రాజ్‌భవన్ వర్గాలు చెప్పాయి. దీనిపై కాంగ్రెస్ నేతలు ఆందోళన చేసేందుకు ప్రయత్నించినా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామాల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో సహా కాంగ్రెస్ నేతలు గవర్నర్‌పై ఆరోపణలు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ ప్రతిపక్ష నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో గవర్నర్ స్పందించారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల్ని ఖండించారు. కరోనా కారణంగానే ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, రాజకీయ డ్రామా చేయడానికి రాజ్‌భవన్ అడ్డా కాదని తమిళిసై ఒకింత ఫైర్ అయ్యారు. కొన్ని నెలలుగా రాజ్‌భవన్ ఇదే విధానాన్ని అవలంభిస్తోందని, ఈ-మెయిల్ ద్వారా ఎవరైనా ఎప్పుడైనా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. రాజ్‌భవన్‌కు రాజకీయాలు ఆపాదించడం సరికాదని, డాటర్ ఆఫ్ తమిళనాడు.. సిస్టర్ ఆఫ్ తెలంగాణగా గవర్నర్ అభివర్ణించుకున్నారు. తనకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని, ప్రజలకు రోల్ మోడల్‌గా ఉండాల్సిన రాజకీయ పార్టీలు భౌతికదూరం పాటించడం లేదంటూ కాంగ్రెస్ నేతలపై అసహనం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ భేటీతో గవర్నర్‌పై ఆరోపణలు..
అయితే ఆ మరునాడే సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ దంపతులను సన్మానించారు. కొద్దిసేపు పలు అంశాలపై చర్చించారు. దీంతో గవర్నర్ తమిళిసై అపాయింట్‌మెంట్ అంశం రాద్ధాంతమైంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కేవలం వినతిపత్రం ఇచ్చేందుకు అడ్డుగా ఉన్న కరోనా.. సీఎం కేసీఆర్‌కు ఎందుకు లేదంటూ కాంగ్రెస్ శ్రేణులు విమర్శలకు పదును పెట్టారు. అయితే అధికార పార్టీ కేవలం బహిరంగంగా మాత్రమే కేంద్ర వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు నాటక మాడుతున్నారని, కానీ గవర్నర్‌తో మాత్రం నూతన బిల్లుకు సీఎం ఆమోదం తెలిపారంటూ ఆరోపణలు సంధించారు.
రెండు పార్టీలూ ఒక్కటేనన్న ఠాగూర్..
ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆదివారం ఘాటుగానే స్పందించారు. కాంగ్రెస్ నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్టున్నారని, కరోనా పేరుతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్‌తో మాత్రం గవర్నర్ తమిళిసై సమావేశమయ్యారని, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులకే మాత్రమే కరోనా అడ్డు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. దీన్ని బట్టి గవర్నర్, బీజేపీ, టీఆర్ఎస్ అంతా ఒక్కటే అనిపిస్తోందని ఠాగూర్ వ్యాఖ్యానించారు.
తమిళుల వైరం..
ప్రస్తుతం రాష్ట్రంలో ఈ అంశం అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అటు గవర్నర్ తమిళనాడుకు చెందిన వారు కాగా.. ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా వచ్చిన మాణిక్యం ఠాగూర్ సైతం తమిళనాడుకు చెందిన వారే. అక్కడ రాజకీయాల్లో ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా… ఇక్కడ మాత్రం ఇద్దరి మధ్య మాటల వైరం నడుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతల పక్షాన ఠాగూర్.. గవర్నర్‌పై ఫైర్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో తమిళ ప్రతినిధుల మధ్య తెలంగాణ వేదికగా మారిందంటూ చర్చించుకుంటున్నారు.