- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పటివరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియానే..
దిశ, వెబ్ డెస్క్ :కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానం పై కొంత కాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. రాహుల్ గాంధీ తిరిగి పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టాలని ఆ పార్టీ సీనియర్ నేతలు కోరుతున్నారు. అందుకు ఆయన సుముఖత వ్యక్తంచేయడం లేదని తెలుస్తోంది. కారణం 2019ఎన్నికల్లో రాహుల్ అధ్యక్షతన ఆ పార్టీ ఘోరంగా విఫలం అవ్వడమే. దానికి పూర్తి బాధ్యత వహిస్తూ రాహుల్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. నాటి నుంచి సోనియానే కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలుగా కొనసాగుతోంది.
అయితే, నాటి నుంచి ఏదో ఒక సందర్భంలో పార్టీలో పూర్తిస్థాయి అధ్యక్ష నియామకంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వాయిస్ పెంచారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షులు తప్పనిసరిగా ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు.
దీనిపై ఎలెక్ట్ కమిటీ స్పందించింది. పార్టీకి అధ్యక్షుల నియామకంలో పొడగింపు ఏమీ ఉండదని, అయితే పార్టీలో సరైన విధానం అమలు అయినప్పుడు పూర్తి స్థాయి ఎన్నిక జరుగుతుందని ప్రకటించింది. అప్పటి వరకు సోనియాగాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉంటారని కాంగ్రెస్ ఎలెక్ట్ పార్టీ ఛీఫ్ వెల్లడించారు.