కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంక్షేమ దీక్ష

by Shyam |
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంక్షేమ దీక్ష
X

దిశ, న్యూస్‌ బ్యూరో: రైతుల పంట సేకరణ, వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యాల‌పై కాంగ్రెస్ పార్టీ మంగళవారం దీక్ష చేపట్టనుందని టీపీసీసీ(తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రైతులు దగాపడ్డారని పేర్కొన్నారు. వారు పండించిన పంటలను సకాలంలో విక్రయించే పరిస్థితి తెలంగాణలో లేదని తెలిపారు.

కొనుగోలు కేంద్రాల్లో గన్నీబ్యాగులు, పట్టాలు కొరత రైతులను వేధిస్తున్నదని పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకుల అండతో రైస్ మిల్లర్లు తేమ, తాలు సాకుతో 6 నుంచి 8 కిలోల కోత విధిస్తున్నారని ఆరోపించారు. రైతులు నుంచి కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
రైతుల డిమాండ్ల సాధన కోసం మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యర్తలు లాక్‌డౌన్ నిబంధనలకు లోబడి ఎక్కడిక్కడ దీక్షలు నిర్వహించాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.

Tags: crop buying centres, farmers, loss, gunny bags, tpcc chief Uttam, Market, Paddy, Farmers

Advertisement

Next Story

Most Viewed