- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్‌ఎస్, బీజేపీకి కాంగ్రెస్ భయం.. హుజురాబాద్‌లో కాంగ్రెస్ ఎఫెక్ట్ ఎవరికి?
దిశ ప్రతినిధి, కరీంనగర్: పోలింగ్ సమీపిస్తున్న క్రమంలో ఆ రెండు పార్టీలు విజయావకాశాలపై మల్లగుల్లాలు పడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ వరకు ఇరు పార్టీల నాయకులే ప్రచార పర్వంలో మునిగిపోయారు. అయితే కాంగ్రెస్ కూడా అభ్యర్థిని బరిలోకి దింపడంతో ఇప్పుడు ఈ రెండు పార్టీల్లో అంతర్మథనం మొదలైంది.
తలరాత మారుతుందా?
కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ రంగంలోకి దిగడంతో బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల్లో ఎవరో ఒకరి విజయావకాశాలను గండి కొట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ చీల్చే ఓట్ల శాతాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్యే ఉన్నప్పటికీ కాంగ్రెస్ కు పడే ఓట్ల ప్రభావం తమ పార్టీపై ఎంతమేర పడుతుందన్న విషయంపై ఆరా తీస్తున్నాయి. ఎన్నికల హడావుడి సమయంలో జరిపిన సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ 10 నుండి 12 శాతం ఓటు బ్యాంకును కలిగి ఉన్నట్లు తేలింది. నాయకుడు లేకున్నా ఇక్కడి ఓటర్లలో అంతమంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడం విశేషం.
అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో జరిగిన ఆలస్యం, ఒక్కో లీడర్ ఇతర పార్టీలవైపు వెళ్లిపోవడంతో ఆ ఓటు బ్యాంకు కాస్త 7 నుండి 9 శాతానికి పడిపోయిందని అంచనా వేశారు. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థితో పాటు ముఖ్య నాయకులు కూడా ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకుకు అదనంగా ఓట్లు చీలిస్తే అవి ఏ పార్టీ ఖాతాకు నష్టాన్ని చేకురుస్తాయన్నదే పజిల్ గా మారింది. ఇప్పటివరకు తమ రెండు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని భావించిన బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు తమ ఆధిక్యత కోసం మాత్రమే పని చేశాయి. కానీ కాంగ్రెస్ ఓట్ల శాతం ప్రభావం కూడా తమ పార్టీ ఆభ్యర్థుల గెలుపోటములను శాసించే ప్రమాదం కూడా లేకపోలేదని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.