- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లడాయి, లడాయి.. లల్లాయిరే!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇప్పుడు కరోనా తర్వాత హాట్ టాపిక్ పోతిరెడ్డిపాడు. అటు ఏపీలోనూ సేమ్ సిచ్వేషన్. రోజుకు ఇద్దరు ముగ్గురు ప్రతిపక్ష సభ్యులు అధికార పక్షాన్ని తిట్టడం, అదే టైంలో కేసీఆర్, జగన్ దోస్తీని తెరమీదకు తేవడం. వాళ్లపై వీళ్లు, వీళ్లపై వాళ్లు ఓ రేంజ్‌లో కామెంట్స్ చేసుకోవడం… అంత మీరే చేశారని ఒకరంటే, మేం ఖాళీగా ఉన్నమా ఖండిస్తలేమా అని మరొకరు… ఇదంతా బొమ్మకు ఒకవైపు.. మరోవైపు ఇదే విషయంపై ఏపీ ప్రతిపక్ష లీడర్ చంద్రబాబు ఆచితూచి అడుగేయడమే అసలు మ్యాటర్. నేతలకు ఏం మాట్లాడొద్దని ఆదేశాలు జారీచేయడంతో రెండు రాష్ట్రాల్లోని అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య డిఫరెంట్ వెదర్ స్టార్ట్ అయ్యింది. దీంతో ప్రాజెక్ట్ ఉన్నది పక్కరాష్ట్రంలో అయినా పోతిరెడ్డిపాడు పొగ మాత్రం తెలంగాణనూ కమ్ముకుంటోంది.
2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక 11 వేల క్యూసెక్కులు ఉన్న పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేలకు పెంచితే అప్పటి కాంగ్రెస్ నేతలు హారతులు పట్టలేదా అని తాజాగా టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. 44 వేలను 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు కేసీఆర్ కారణం కాదా అని మళ్లీ అదే కాంగ్రెస్ నేతలు విమర్శల స్పీడ్ పెంచుతున్నారు. టోటల్‌గా ఈ అంశానికి మొత్తం బూస్ట్ ఇచ్చినట్లుగా బీజేపీ సైతం దీక్షలు, కేంద్రమంత్రికి లెటర్లతో లడాయి స్టార్ట్ చేసి జనాల్లోకి గట్టిగా వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. కాంగ్రెస్, బీజేపీ ఎవరికివారు కేసీఆర్, జగన్‌లపై విమర్శలు చేస్తున్నా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచొద్దన్నదే అసలు పాయింట్. అందుకే పోతిరెడ్డిపాడుపై అటు ఇటు తిప్పి చివరకు కేసీఆర్ టార్గెట్‌గా ఆరోపణలు గుప్పిస్తున్నారనే విమర్శలున్నాయి.
పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్, బీజేపీ ఎంత లడాయి చేసినా అధికార పక్షం నుంచి అనుకున్నంత తిప్పికొట్టుడు మాత్రం కనపడటం లేదన్నది రాజకీయాల్లో వినపడుతున్నా మాట. కేసీఆర్ రాయలసీమకు వెళ్లి రతనాల సీమ చేద్దామన్నప్పటి నుంచే జగన్ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై నిర్ణయం తీసుకొని ఏపీ అసెంబ్లీలో ప్రకటన చేశారని బహిరంగంగా వినపడుతున్న మాట. ఏపీ జీవో 203పై కేఆర్ఎంబీకి ప్రభుత్వం ఫిర్యాదు చేసినా ప్రతిపక్ష లడాయికి తగు రీతిలో స్పందన రావడం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏపీలో భూసేకరణ కూడా జరుగుతోందని వార్తలు వినిపిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రధానికి ఎలాంటి లేఖ రాయకపోవడమే గాక సీఎం కేసీఆర్ ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారన్నది కాంగ్రెస్, బీజేపీల కామన్ పాయింట్. దీంతో ప్రతిపక్షం ఎంత లడాయి చేసినా సర్కార్ లల్లాయిల పాట మాదిరిగా వ్యవహరిస్తోందని పలువురు అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నమాట.