- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేం పనిచేయందే.. జిల్లా మొదటి స్థానంలో ఉందా?
దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చేపట్టారు. గురువారం సాయంత్రం తమ విధుల ముగిసిన తరువాత ఉపాధి హామీ పనులను తమ విభాగం నుంచి తొలగించాలని గ్రామ కార్యదర్శులు ఆందోళన చేస్తున్నారు. జిల్లాలో 20 శాతం కూడా ఉపాధి హామీ పనులలో వెనకబడి ఉన్న పంచాయతీ కార్యదర్శులకు మెమోలు ఇవ్వడాన్ని వారు నిరసించారు. ఈ సందర్భంగా కార్యదర్శులు మాట్లాడుతూ.. ఉపాధి పనులకు కూలీలు రాకపోతే తాము ఎలా బాధ్యులమవుతామని ప్రశ్నిస్తున్నారు. తాము చేస్తున్న పనులతో పాటు ఉపాధి హామీ పనులను కూడా తమకు అప్పగించడం సరికాదన్నారు. పనిలో వెనబడ్డారంటూ నోటీసులు ఇవ్వడంతో పాటు ఆ నోటీసులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి స్వయంగా వచ్చి సంజాయిషీ ఇచ్చి నోటీసు తీసుకోవాలని అధికారులు చెప్పడాన్ని ఖండించారు. తాము దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నామని, ప్రతిరోజూ రావడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. అలాగే తాము పని చేయనిదే ఉపాధి హామీ పనుల్లో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందా? ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ఆందోళన వద్దకు వస్తేనే తాము ఆందోళన విరమిస్తామని పట్టుబట్టి కూర్చున్నారు. జాయింట్ కలెక్టర్ వచ్చి పది మంది వచ్చి సమస్యను కలెక్టర్‌కు వివరిస్తానని సూచించినా ఉద్యోగులు వినిపించుకోలేదు. కలెక్టర్ వస్తే డిమాండులతో కూడిన వినతిపత్రాన్ని అందజేస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. కలెక్టర్ బయటకు రాడని అధికారులు అంటున్నారు. కలెక్టర్ వస్తే తప్ప తాము ఆందోళన విరమించేది లేదని కార్యదర్శులు తెగేసి చెప్తున్నారు.