- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు మీద కనకవర్షం.. ఎగబడ్డ జనాలు!
దిశ, ఫీచర్స్ : ఆరుబయట నడుస్తూ వెళ్తున్నప్పుడు ఓ పది రూపాయలు నోటు కనిపిస్తేనే .. లక్ష్మీ కటాక్షమంటూ కళ్లకద్దుకుని జేబులో పెట్టేసుకుంటాం. అలాంటిది హైవేపై నోట్ల వర్షం కురిస్తే.. జనం ఊరుకుంటారా?. అందుకే వాటిని పట్టుకునేందుకు ఎగబడ్డ జనం.. దొరికిన నోట్లు దొరికినట్లు జేబుల్లో, బ్యాగుల్లో నింపేసుకున్నారు. ఇదంతా ఏదో సినిమాలో జరిగిన సన్నివేశం కాదు.. నిత్యం రద్దీగా ఉండే సదరన్ కాలిఫోర్నియా ఫ్రీవేపై ఈ దృశ్యం కనిపించింది. ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ డెమి బాగ్బీ ఈ వీడియోను క్యాప్చర్ చేసి.. సోషల్ మీడియాలో షేర్ చేసింది.
శాన్‌డిగో నుంచి కాలిఫోర్నియాలోని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కార్యాలయానికి డబ్బు సంచులతో బయలుదేరిన వాహనం తలుపు మార్గమధ్యంలో తెరుచుకోవడంతో కొన్ని సంచులు కిందపడి పోయాయి. ఆ మూటల్లోని డబ్బంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో ప్రయాణికులు ఆ డాలర్స్ చూసి షాక్‌కు గురయ్యారు. వాహనదారులు తమ వెహికల్స్ ఆపుకుని, ఆ డబ్బును ఏరుకునేందుకు ఎగబడ్డారు. ఒకరిని చూసి మరొకరు రోడ్డుపై ఎగిసిపడుతున్న నోట్లను పట్టుకునేందుకు పోటీపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇరువైపులా రోడ్డును బ్లాక్ చేసి, వాహనదారులను అడ్డుకున్నారు. చోరీకి గురైన నగదును వెంటనే తిరిగి ఇవ్వకపోతే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించడంతో కొందరు ఇవ్వగా, మరికొందరు మాత్రం జారుకున్నారు.‘కార్ల్స్‌బాడ్‌లోని ఇంటర్‌స్టేట్ 5లో శుక్రవారం ఉదయం 9:15 గంటలకు ఈ సంఘటన జరిగింది. వీటిలో చాలా వరకు నగదు $1, $20 బిల్స్ రోడ్డంతటా చెల్లాచెదురుగా ఉండటంతో గందరగోళం ఏర్పడింది. డబ్బుల్ని తీసుకోవద్దు. చాలా మంది వ్యక్తులు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు, మీరు బహుశా ఆరోపణలను ఎదుర్కోవచ్చు. దయచేసి మాతో సహకరించండని హెచ్చరించాం. చాలామంది సేకరించిన డబ్బును ఇప్పటికే తిరిగి ఇచ్చారు. వారికి మా ధన్యవాదాలు. ఇక ఇవ్వని వారి కోసం ఓ ప్రకటన జారీ చేశాం. సంఘటన జరిగిన ప్రదేశంలో మీ వెహికల్స్ లైసెన్స్ ప్లేట్స్ సహా మీ ముఖాలు కనిపిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. డబ్బు దొంగతనంలో పాల్గొన్న వారిని గుర్తించడానికి CHP FBIతో కలిసి పని చేస్తోంది. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశాం. మిగతా వారి కోసం వెతుకుతున్నాం’ అని కాలిఫోర్నియా హైవే పెట్రోల్ (CHP) అధికారులు తెలిపారు.
2018లో, న్యూజెర్సీలో ఒక సాయుధ ట్రక్కు వెనుక తలుపు సరిగా పనిచేయకపోవడంతో హైవేపై నగదు చెల్లాచెదురుగా పడింది. మళ్లీ ఇప్పుడు కూడా సేమ్ ఇలాంటి సంఘటన జరగడం గమనార్హం.