- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వరికోత ధరను అందరూ కలిసి నిర్ణయించాలి’
దిశ, నిజామాబాద్: యంత్రాల ద్వారా వరి కోయించడానికి గంటకు ఎంత ధర చెల్లించాలన్న విషయాన్ని రైతు సమన్వయ సమితి ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, రైతులు కలిసి నిర్ణయించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ మండలాల అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఏఈవోలు క్లస్టర్ పరిధిలో ఉండి ధాన్యం కోతలు క్రమపద్ధతిలో చేపట్టే విధంగా కూపన్లు అందజేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు భౌతిక దూరం పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కేంద్రాల వద్ద టార్ఫాలిన్లు, తూకం యంత్రాలు, తేమను చూసే పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. స్థానికంగా ఉండే హమాలీలను వినియోగించుకోవాలని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడూ ట్యాబ్లో నమోదు చేయాల్సిన బాధ్యత ఏఈవోదేనని స్పష్టం చేశారు. ఎస్పీ శ్వేతా మాట్లాడుతూ.. రాత్రిపూట ధాన్యం కొనుగోలు చేపట్టవచ్చని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, డీసీఓ మమత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags : Collector, Video Conference, Farmer Coordinating, Committee, nizamabad