- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి’
దిశ, వరంగల్: రక్తదానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ వి.పి గౌతమ్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో ఏరియా కోఆర్డినేటర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ భీమ్ సాగర్, జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్‌లతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్లు రక్తం నిల్వ కొరతను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన ఏర్పాట్లను రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పి.వి ప్రసాద్ సాయం తీసుకోవాలని సూచించారు. అలాగే, రక్తదానం చేసేందుకు యువతను చైతన్య పరచాలన్నారు. బుధవారం ఉదయం 8గంటలకు పత్తిపాక రోడ్డులోని ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేయనున్న రక్తదాన శిబిరంలో తనతో పాటు కలెక్టరేట్ సిబ్బంది సైతం పాల్గొంటారని గౌతమ్ హామీ ఇచ్చారు. రక్తదానంపై ఆసక్తి ఉన్నవారు 8121945884 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Tags: blood donation, collector goutham, warangal, youth participate in blood donation, redcross, ima hall